Ram Charan: 4 కిలోల బరువు తగ్గాను.. 300 మందికిపైగా.. ఇప్పటికీ కాళ్లు వణుకుతాయి: రామ్ చరణ్
చిరుత సినిమాతో మెగాస్టార్ నట వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే నటన, డ్యాన్స్, యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టి అనతికాలంలోనే మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. ఇక గతేడాది వచ్చిన రౌద్రం రణం రుధిరం (RRR) సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. ఈ సినిమా రామ్ చరణ్ మాత్రమే కాకుండా ఎంటైర్ యూనిట్ కు పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.
ఇక ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ రావడంతో RRR టీమ్ అమెరికాలో ప్రమోషన్స్ చేస్తోంది. వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రామ్ చరణ్ తాజాగా షాకింగ్ విషయాలు తెలిపాడు.

వరల్డ్ వైడ్ గా సత్తా..
తెలుగు చిత్రీసీమ దర్శక దిగ్గజం, జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఎల్లలు దాటి అశేష ప్రేక్షక లోకం కొనియాడేలా చేసింది. గతేడాది విడుదలైన ఈ సినిమా అవార్డులతో సునామీ సృష్టిస్తోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్, సీటెల్ ఫిల్మ్ క్రిటిక్స్, హెచ్సీఏ అవార్డులు గెలుచుకుని ఇంకా ప్రభంజనం కొనసాగిస్తూ ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది.

అవార్డ్ నామినేషన్స్..
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన చెర్రీ నటనకు యావత్ ప్రపంచమే ప్రశంసల జల్లులు కురిపించింది. తెలుగు సినిమా చిరకాల కోరిక అయిన ఆస్కార్ కోసం నాటు నాటు సాంగ్ ఆస్కార్ 2023 అవార్డుల నామినేషన్స్ లో ఉన్న విషయం తెలిసిందే.

పాపులర్ ప్రోగ్రామ్..
RRRలోని నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుందని చిత్ర యూనిట్ తో పాటు కోట్లాది భారతీయులు నమ్ముతున్నారు. ఈ క్రమంలో ఆస్కార్ వేడుకల కంటే ముందుగానే చిత్రబృందం అమెరికా వెళ్లింది. ఇందులో భాగంగానే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి తదితరులు వరుస పెట్టి అమెరికన్ పాపులర్ మీడియా ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలోనే అమెరికాలో పాపులర్ అయిన ఎంటర్టైన్ మెంట్ ఎట్ నైట్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాడు చెర్రీ.

పదాలేంటో అర్థం కాకున్నా..
ఎంటర్టైన్ మెంట్ ఎట్ నైట్ ప్రోగ్రామ్ లో పార్టిస్ పేట్ చేసిన రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు తెలిపాడు. "నాటు నాటు పాట (Natu Natu Song) కేవలం RRR సినిమాలోని సాంగ్ అని మాత్రమే అనుకోవద్దు. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా ప్రజలందరూ మెచ్చిన పాట ఇది. భిన్న సంస్కృతులకు సంబంధించిన, వేర్వేరు వయసులకు చెందినవారు పాటలో పదాలేంటో అర్థం కాకపోయినప్పటికీ కనెక్ట్ అయ్యారు. స్టెప్పులు వేశారు" అని రామ్ చరణ్ తెలిపాడు.

ప్రెసిడెంట్ కూడా యాక్టర్..
రామ్ చరణ్ నాటు నాటు పాట గురించి కొనసాగిస్తూ.. "జపాన్ నుంచి యూఎస్ వరకు ప్రతీ ఒక్కరూ నాటు నాటు పాటను ప్రేమించారు. ఇది ఎవరూ కాదనలేని నిజం. ఓ నటుడిగా ఇంతకంటే గొప్పగా ఏది కోరుకోను. ఈ పాట కోసం మేము చాలానే కష్టపడ్డాం. ఉక్రెయిన్ ప్రెసిడెంట్స్ ప్యాలెస్ ముందు వారం రోజుల పాటు రిహార్సల్స్ చేశాం. అక్కడి ప్రెసిడెంట్ కూడా ఓ యాక్టర్ కావడంతో షూటింగ్ చేసుకుంటామన్న మా అభ్యర్థనను మన్నించారు" అని పేర్కొన్నాడు.

ఆ కష్టం గురించి ఆలోచించినా..
"నాటు నాటు పాట చిత్రీకరణలో 300 వందల మందికిపైగా పాల్గొన్నారు. అందులో 150 మంది డ్యాన్సర్స్ సెట్ లో పాల్గొన్నారు. ఇంకా 200 మంది యూనిట్ సభ్యులు ఉన్నారు. ఆ పాటను చిత్రీకరించడానికి 17 రోజుల సమయం పట్టింది. డ్యాన్స్ చేసే క్రమంలో చాలా రీటేక్స్ తీసుకున్నాం. నేనైతో 4 కిలోల బరువు తగ్గిపోయాను. ఆ కష్టం గురించి ఇప్పుడు ఆలోచించినా నా కాళ్లు వణుకుతాయి" అని చెర్రీ చెప్పుకొచ్చాడు. కాగా మార్చి 12న లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ 2023 వేడుకలు ఘనంగా జరగనున్నాయి.


Click it and Unblock the Notifications











