ప్రభాస్‌ను బ్యాడ్ బాయ్ అంటూ సెన్సేషనల్ కామెంట్.. వైరలవుతోన్న పోస్ట్
బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకుని.. సాహో సినిమాతో విజువల్ ట్రీట్ ఇచ్చిన ప్రభాస్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రపంచ స్థాయిలో ట్రెండింగ్..
ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా నిన్న సాయంత్రం నుంచే ట్వీట్లు హోరెత్తాయి. ఆ దెబ్బకు కొన్ని క్షణాల్లో ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. #HappyBirthdayPrabhas #HappyBirthdayDarling అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అయింది. జాతీయ స్థాయిలో ప్రభాస్ అభిమానులుండటం.. ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవడంతో డార్లింగ్ అభిమానులు సంబరపడిపోయారు.

సోషల్ మీడియాను ఊపేస్తున్న ట్వీట్లు...
టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా చిన్న నటుల నుంచి పెద్ద నటుల వరకు ప్రభాస్‌కు విషెస్ చెబుతున్నారు. నిర్మాతలు, దర్శకులు, నిర్మాణ సంస్థలు (సురేష్ ప్రొడక్షన్స్, డీవీవీ ఎంటర్టైన్మెంట్స్) ఇలా ఎంతోమంది పుట్టిన రోజు శుభాకాంక్షలను చెబుతున్నారు.
వెరైటీగా చెప్పిన చెర్రీ..
సాహో సినిమాలోని బ్యాడ్ బాయ్ సాంగ్ ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. బ్యాడ్ బాయ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహ మహోత్సవంలో డ్యాన్స్ చేస్తోన్న పిక్‌ను పోస్ట్ చేశాడు.
బ్రదర్ అంటూ రానా విషెస్..
బాహుబలి సినిమాలో రానా, ప్రభాస్ అన్నదమ్ములుగా నటించిన సంగతి తెలిసిందే. అందుకేనేమో.. హ్యాపీ బర్త్‌డే బ్రదర్ అంటూ తనస్టైల్లో విషెస్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











