Chiranjeevi charitable trust: అభిమానులు చేసిన పనికి రామ్ చరణ్ ఫిదా
మెగాస్టార్ చిరంజీవి - రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్.. ఈ స్టార్స్ ఎంత క్రేజ్ అందుకున్నా కూడా సహాయం చేయాల్సిన పరిస్థితి వస్తే ఏ మాత్రం వెనుకడుగు వేయరని అందరికి తెలిసిన విషయమే. ఇక ప్రస్తుతం మెగాస్టార్ కోవిడ్ మరణాలను అడ్డుకునేందుకు ఒక భారీ సేవా కార్యక్రమానికి సిద్దమైన విషయం తెలిసిందే. బ్లడ్ బ్యాంక్ తరహాలోనే ఆక్సిజన్ బ్యాంక్ ద్వారా సహాయం చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి చారిటబుల్ ట్రస్టు ద్వారా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు అవసరమైన సమయంలో ఆక్సిజన్ అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రోజు వందల సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లను పంపుతూ ఎంతోమందికి సహాయం చేస్తున్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో మెగా అభిమానులు స్వచ్ఛధంగా పాల్గొనడం విశేషమని చెప్పాలి. కేవలం హాస్పిటల్ వరకే కాకుండా ఇంటికి కూడా పంపుతున్నారు.

ఇటివల అనంతపురం అభిమానులు ఒక పనితో రామ్ చరణ్ ను ఆకర్షించారు. ఆక్సిజన్ అత్యవసరం అని చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకుకి వచ్చిన వారి నుంచి వివరాలు తెలుసుకుంటున్నారు, ఇక ఇంటికేవెళ్లి మరి స్వయంగా అందచేసి, మెగా ఫ్యాన్స్ అండగా నిలుస్తున్నారు. ఈ విషయం రామ్ చరణ్ కు తెలియడంతో వారిని సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. మీరు చేసిన పని నిజంగా చాలా గొప్పది అంటూ రామ్ చరణ్ ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











