Ram Charan: ఉపాసనకు కవలలు జన్మించిన వేళ.. రాంచరణ్ సంచలన నిర్ణయం
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన కొణిదెల దంపతులు పండంటి కవలలకు జన్మనివ్వడంతో మెగా ఫ్యామిలీలోను, అభిమానుల్లోను సంబరాలు మొదలయ్యాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ఓ బాబు, మరో అమ్మాయికి ఉపాసన జన్మనిచ్చారు. దాంతో చిరంజీవి కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అయితే ఓ పక్క సంబరాల్లో భాగమైన రాంచరణ్ మరో వైపు సంచలన నిర్ణయం తీసుకోవడమే కాకుండా మానవత్వాన్ని చాటారు. తనతో కలిసి పనిచేసే కార్మికుల సంక్షేమం, శ్రేయస్సు కోసం గొప్ప మనసును చాటారు. రాంచరణ్ తీసుకొన్న నిర్ణయం ఏమిటనే వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి మాదిరిగానే రాంచరణ్ డ్యాన్సులు, స్టెప్పులతో అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆలరిస్తుంటారు. అయితే తన గుర్తింపు తెచ్చే డ్యాన్సర్ల సంక్షేమం కోసం ఆయన ముందుకొచ్చారు. గతంలో కూడా సుమారుగా 500 మంది డ్యాన్సర్లకు తన వంతుగా హెల్త్ ఇన్సూరెన్స్‌ను చేయించారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా వారికి ఆరోగ్య భీమాను కల్పించాలని నిర్ణయం తీసుకొన్నారు.

మెగా హీరో రాంచరణ్ గతంలో కూడా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేపట్టి ఆపదలో ఉన్నవారిని ఆదుకొన్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా తనతో కలిసి పనిచేసే సినీ డ్యాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు అండగా నిలువాలని నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు డ్యానర్ల అసోసియేషన్‌లోని ప్రతీ సభ్యుడికి ఆరోగ్య భీమా కల్పించేందుకు ముందుకు వచ్చారు. అందుకు కావాల్సిన 50 లక్షల రూపాయలను అందజేశారు.
తన కెరీర్‌లో భాగమైన కొరియోగ్రాఫర్ల కోసం ముందుకు వచ్చి గొప్ప స్టార్ మాత్రమే కాదు.. మంచి హృదయం ఉన్న వ్యక్తిగా, మానవత్వం చాటుకొనే సాటి మనిషిగా మరోసారి రుజువు చేసుకొన్నారు. తమ ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చెర్రీ ముందుకు రావడంపై డ్యాన్సర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా తమకు సహాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు. డ్యాన్సర్ల అసోసియేషన్‌కు సహాయం అందించిన మెగా పవర్ స్టార్‌కు అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత, జానీ మాస్టర్ ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుతం రాంచరణ్ పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలోని చికిరి అనే పాట ఇప్పటికే రికార్డు క్రియేట్ చేసింది. సోషల్ మీడియాలోను, యూట్యూబ్‌లోని సంచలనం క్రియేట్ చేసి రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ప్రస్తుతం మెగా వారసుడి రాకతో రాంచరణ్ కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











