G20 summit శ్రీనగర్‌లో స్టైల్‌గా రాంచరణ్ ప్రత్యక్షం.. జీ20 సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా మెగా పవర్ స్టార్!
టూరిజం, ఇతర అంశాల అభివృద్ది లక్ష్యంగా జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి అంతా సిద్దమైంది. మే 22 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 24వ తేదీ వరకు ఈ సమావేశం జరుగనున్నది. 2019లో కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను తొలగించిన తర్వాత ఇలాంటి భారీ సమావేశం జరగడం కశ్మీర్‌లో ఇదే తొలిసారి. ఈ వేడుకకు మూడంచెల కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం గురించిన తాజా వివరాల్లోకి వెళితే..
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో పాల్గొనే అతిథుల భద్రత కోసం నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్ఎస్‌జీ)ని, మార్కోస్ కమాండోస్ పహారాను ఏర్పాటు చేశారు. వేదిక చుట్టూ డేగకన్నుతో ఈ కమాండోస్ రక్షణ కల్పిస్తారు అలాగే జమ్ము, కశ్మీర్‌కు చెందిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నది.

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఇప్పటికే డెలిగేట్లు శ్రీనగర్‌కు చేరుకొన్నారు. శ్రీనగర్‌కు వెళ్లే దారి పొడుగునా జీ20 లోగోలను ఏర్పాటు చేశారు. వీధులను, రోడ్లను సుందరీకరించారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వరకు రోడ్డు పొడుగునా టూరిజానికి సంబంధించిన బ్యానర్లతో అలంకరించారు.
జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ పాల్గొంటున్నారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు రాంచరణ్ సోమవారం ఉదయం శ్రీనగర్ చేరుకొన్నారు. శ్రీనగర్‌కు బయలుదేరుతుండగా.. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మీడియా కెమెరాలకు రాంచరణ్ చిక్కారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ రాంచరణ్ మిలిటరీ క్యాప్ ధరించి.. బ్లాక్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్‌లో ఎయిర్‌పోర్టులో కనిపించారు. శ్రీనగర్ బయలు దేరుతూ మీడియా కెమెరాలకు ఫోజిచ్చారు. ఇక రాంచరణ్ విషయానికి వస్తే.. సినిమా నటుడే కాకుండా నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇంకా పలు వ్యాపారాల్లో ఆయన నిమగ్నమైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











