ఎక్కువగా ముంబైలోనే రామ్ చరణ్.. కొణిదెల బ్రాండ్ కూడా అక్కడ హైలెట్ అయ్యేలా ప్లాన్?
[4:25 pm, 10/02/2022] nareshkondapalli99: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఎక్కువగా బిగ్ బడ్జెట్ సినిమాలను చేసేందుకు చర్చలు జరుపుతున్నారు. RRR సినిమా తప్పకుండా బాక్సాఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అందరూ నమ్ముతున్నారు. ఇక ఆ తరువాత రామ్ చరణ్, ఎన్టీఆర్ మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోతుంది. ఇక ఆ సినిమా రిలీజ్ ముందుగానే చరణ్ బిగ్ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెట్టె ప్రయత్నాలు చేస్తున్నాడు.
చరణ్ కు బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఇక ఈ సమయంలో రామ్ చరణ్ తేజ్ తొందర పడకుండా కేవలం నమ్మకమైన కథలను మాత్రమే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. అంతేకాకుండా ప్రయోగాత్మకమైన సినిమాలు కూడా చేయాలని రామ్ చరణ్ తేజ్ కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు. ఇటీవల కాలంలో చరణ్ ఎక్కువగా ముంబై వెళ్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు రామ్ చరణ్ తో వర్క్ చేయాలని అనుకుంటున్నాయి. గతంలోనే ఈ హీరో హిందీలో జంజీర్ అనే సినిమా చేశాడు. కానీ ఆ హిందీ దారుణమైన ఫలితాన్ని అందుకుంది. అయినప్పటికీ రామ్ చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు.

కానీ చరణ్ అటు వైపు ఎక్కువగా ఫోకస్ చేయకుండా ముందుగా తెలుగులో తన మార్కెట్ ను పెంచుకోవాలని చాలాకాలంపాటు ఎదురు చూశాడు. మొత్తానికి RRR సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిందీలో భారీ స్థాయిలో విడుదల అవుతోంది. ఇక ఆ తర్వాత చేయబోయే సినిమాలో కూడా అదే రేంజ్ లో ఉంటాయని అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. లిస్టులో మరికొంత మంది దర్శకులు ఉన్నారు. కానీ ఇంకా ఫైనల్ చేయలేదు.
సుకుమార్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు కానీ ఇంకా స్క్రిప్ట్ పూర్తి చేయలేదు. అయితే చరణ్ కొణిదెల ప్రొడక్షన్ లో హిందీలో కూడా కొన్ని సినిమాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఖైదీ నెంబర్ 150, సై రా వంటి సినిమాలను నిర్మించిన కొణిదెల ప్రొడక్షన్ ఇప్పుడు ఆచార్యను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది. అయితే తను చేయబోయే కొన్ని సినిమాలకు చరణ్ సహా నిర్మాతగా కూడా ఉంటాడని సమాచారం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ తెలుగులో మహేష్ బాబు కూడా అదే తరహాలో వారి సినిమాలకు ఒక విధంగా సహనిర్మాతగా బాధ్యతగా ఉంటారు.
రామ్ చరణ్ కూడా అదే తరహాలో ఆలోచించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. కేవలం కేవలం తెలుగులోనే బాలీవుడ్ లో కూడా సినిమాలను నిర్మించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామ్ చరణ్ బ్రాండ్ ప్రమోషన్ చేసే అవకశాలు కూడా ముంబైలోనే ఎక్కువగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల సంజయ్ లీలా బన్సాలి వంటి అగ్ర దర్శకులను కూడా కలిసినట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఒక క్లారిటీ రావాలంటే రామ్ చరణ్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











