Ram Charanకు స్పెషల్ సర్ ప్రైజ్.. సాంగ్ షూటింగ్ తర్వాత అలా.. పిక్స్ వైరల్!
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. చిరుత సినిమాతో తెలుగు తెరపై తెరగేంట్రం చేసి మెగా పవర్ స్టార్ గా ఎదిగాడు. తర్వాత మగధీర సినిమాతో చిన్నా పెద్దా అని తేడా లేకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు చెర్రీ. ఇక గతేడాది విడుదలైన RRR సినిమాతో ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొంది గ్లోబల్ స్టార్ అయ్యాడు. నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంతో ఆ సినిమా టీమ్ కు విశేషమైన గుర్తింపు లభించింది. అయితే మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే అన్న విషయం తెలిసిందే. అయితే చెర్రీ పుట్టనరోజు వేడుకలు మార్చి 26న అంటే ఆదివారం రోజునే ప్రారంభం అయ్యాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు అప్పుడే మొదలయ్యాయి. మార్చి 27న చెర్రీ బర్త్ డే కాగా.. 26 నాడే సెలబ్రేషన్స్ జోరుగా స్టార్ట్ అయ్యాయి. 38 నుంచి 39వ వసంతంలోకి అడుగుపెడుతున్న రామ్ చరణ్ కు శుభాకాంక్షలు చెప్పడం మొదలైంది. ఇక చెర్రీ జన్మదినం సందర్భంగా స్పెషల్ ఈవెంట్ ను కూడా ప్లాన్ చేశారు. ఇప్పటికే దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రామ్ చరణ్ ఆచార్య తర్వాత నటిస్తున్న చిత్రం RC15. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియార అద్వానీ రెండోసారి రామ్ చరణ్ తో జత కడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేయగా మరొక హీరోయిన్ గా అంజలి నటిస్తోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్న RC15 షూటింగ్ సెట్ లో రామ్ చరణ్ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా నిర్వహించారు.
ముందుగా కియారా అద్వానీ, రామ్ చరణ్ తో ఒక పాట చిత్రీకరించారు డైరెక్టర్ శంకర్. సాంగ్ షూటింగ్ పూర్తయిన తర్వాత చెర్రీ పుట్టిన రోజు వేడుకలు చేశారు. మూవీ టీమ్ సర్ ప్రైజ్ తో రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశాడు. అందరీకి ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం RC15 మూవీ షూటింగ్ సెట్ లో జరిగిన రామ్ చరణ్ బర్త్ డే వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకల్లో డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజు, కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా, హీరోయిన్ కియారా అద్వానీతోపాటు మిగతా మూవీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఇందులో గులాబీ రేకులతో స్వాగతం పలికిన సినిమా యూనిట్, చెర్రీతో కేక్ కట్ చేయించిన దృశ్యాలు చూడొచ్చు.


Click it and Unblock the Notifications











