HBD Ram Charan: ‘చిరుత’నయుడు - గ్లోబల్ స్టార్‌గా.. చరణ్ లైఫ్‌లో బెస్ట్ మూమెంట్ అదే.. ఈ విషయాలు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా 'చిరుత' మూవీతో హీరోగా పరిచయమై.. చాలా తక్కువ సమయంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఆరంభంలోనే ఎన్నో విజయాలను ఖాతాలో వేసుకున్న అతడు.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను ఏర్పరచుకున్నాడు. అప్పటి నుంచి ఏమాత్రం వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు. ఈ మధ్య కాలంలో అయితే గ్లోబల్ స్టార్‌గా మారి రచ్చ లేపుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ పుట్టినరోజు (మార్చి 27) సందర్భంగా అతడి గురించి స్పెషల్ స్టోరీని చూద్దాం పదండి!
అలా ఎంట్రీ.. ఇండస్ట్రీ హిట్:పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన 'చిరుత' మూవీతో రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. రెండో చిత్రం 'మగధీర'తో భారీ విజయాన్ని అందుకుంది. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పట్లో కలెక్షన్లను కూడా రికార్డు స్థాయిలో రాబట్టింది. ఫలితంగా చరణ్ రేంజ్ అమాంతం పెరిగింది. అయితే, ఆ తర్వాత 'ఆరెంజ్' మాత్రం డిజాస్టర్ అయింది.

ఆ మూవీతో మరో యాంగిల్:ఆ మధ్య కాలంలో రామ్ చరణ్ చాలా సినిమాల్లో నటించాడు. కానీ, ఇవేమీ అతడికి విజయాన్ని మాత్రం ఇవ్వలేదు. వీటి తర్వాత 'ధృవ'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇక, దాని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం'తో మరోసారి ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అంతేకాదు, ఈ చిత్రంతో రామ్ చరణ్ తన యాక్టింగ్‌లోని అసలైన యాంగిల్ చూపించాడు.
గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడుగా:చాలా కాలం పాటు తెలుగు చిత్రాలకే పరిమితం అయిన రామ్ చరణ్.. రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీ చేశాడు. ఎన్టీఆర్ కూడా నటించిన ఈ చిత్రం సెన్సేషనల్ హిట్ అయింది. అంతేకాదు, ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు అదిరిపోయే పేరు వచ్చింది. మరీ ముఖ్యంగా అతడి ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోయింది. ఫలితంగా రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయాడు.

ట్రోల్స్ నుంచి దండాలతో:రామ్ చరణ్ 'జంజీర్' అనే మూవీతో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ మూవీ కూడా డిజాస్టర్‌గానే మిగిలిపోయింది. అంతేకాదు, అప్పుడు 'చెక్క ముఖం హీరో' అంటూ ఆ ఇండస్ట్రీలో చరణ్‌పై ట్రోల్స్ చేశారు. అలాంటిది RRR చిత్రంలో అతడి యాక్టింగ్ చూసి దండం పెట్టేశాడు. అలా విమర్శించిన వాళ్లతోనే సలామ్ కొట్టించుకున్నాడు.
నిర్మాతగానూ.. సేవలతో:హీరోగా నటిస్తూనే రామ్ చరణ్.. తండ్రి మెగాస్టార్ చిరంజీవి కోసం నిర్మాతగానూ మారాడు. ఆయనను సినిమాల్లోకి తిరిగి తీసుకొచ్చేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ ఏర్పాటు చేసి 'ఖైదీ నెంబర్ 150', 'సైరా: నరసింహారెడ్డి', 'ఆచార్య' వంటి మూవీలు చేశాడు. ఇక, భార్య ఉపాసన కోసం అపోలో ఆస్పత్రిలో భాగం అవడంతో పాటు బ్లడ్ బ్యాంక్, ఆక్సీజన్ బ్యాంక్‌లు పెట్టాడు.

మూడు మూవీలతో బిజీ:గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తోన్న అతడు.. బుచ్చిబాబు సనతోనూ ఓ మూవీ ప్రకటించాడు. ఇటీవలే ఇది పూజా కార్యక్రమాలు జరుపుకుంది. దీని తర్వాత రామ్ చరణ్.. సుకుమార్ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయబోతున్నాడు.
బెస్ట్ మూమెంట్ ఇదేగా:సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో రామ్ చరణ్ ఎన్నో అరుదైన ఘనతలను, రికార్డులను సొంతం చేసుకున్నాడు. అలాగే, ఈ మధ్య కాలంలో గ్లోబల్ స్టార్‌గానూ ఎదిగిపోయాడు. ఇవన్నీంటి కంటే గత ఏడాది రామ్ చరణ్ తండ్రి అయ్యాడు. అదే అతడి లైఫ్‌లో బెస్ట్ మూమెంట్‌గా ఫ్యాన్స్ చెబుతుంటారు. ఈ బుల్లి యువరాణికి 'క్లింకారా' అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే.
నటుడిగా, నిర్మాతగా చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఫిల్మీబీట్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు.


Click it and Unblock the Notifications











