ఒళ్లు గగుర్బొడిచే విన్యాసం: బాబాయ్‌ పుట్టినరోజున రామ్ చరణ్ సర్‌ప్రైజ్ (వీడియో)

By Bojja Kumar

Recommended Video

Ramcharan's Surprise Wishes To Pawan Kalyan On His Birthday

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒళ్లుగగుర్బొడిచే విన్యాసాలు చేశాడు. గాల్లో పారాచూట్ విన్యాసాలు చేస్తూ బాబాయ్‌ని విష్ చేశాడు. నా జీవితంలో, సినిమాల్లో పలు సాహసోపేతమైన పనులు చేయడానికి నువ్వే నాకు స్పూర్తి. అందుకే నీ పుట్టినరోజు సందర్భంగా ఈ విన్యాసం చేస్తున్నాను. నువ్వు మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి అని రామ్ చరణ్ ఆకాంక్షించారు.

అది జనసేన జెండానా?

రామ్ చరణ్ సాహస విన్యాసం చేసిన పారాచూట్ కూడా జనసేన పార్టీ జెండాను తలపించేలా ఉండటం గమనార్హం.

పుట్టినరోజు కానుక ఇదేనా?

పుట్టినరోజు కానుక ఇదేనా?

బాబాయ్ పుట్టినరోజున స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుందని రామ్ చరణ్ చెప్పడంతో అభిమానులంతా.... చరణ్-బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ ఉంటుందని భావించారు. కానీ అలాంటిదేమీ విడుదల చేయలేదు కాబట్టి... రామ్ చరణ్ పోస్టు చేసిన ఈ వీడియోనుసర్‌ప్రైజ్‌గా భావించాలి.

బాబాయ్ మీద ఎంతో ప్రేమ

బాబాయ్ మీద ఎంతో ప్రేమ

రామ్ చరణ్‌కు బాబాయ్ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పడానికి ఈ వీడియో ఒక్కటి చాలు అంటున్నారు అభిమానులు. పవర్ స్టార్ ఆశీస్సులతో భవిష్యత్తులో ఆయన స్థానాన్ని రామ్ చరణ్ భర్తీ చేయాలని కోరుకుంటున్నారు.

బాబాయ్‌కి పూర్తి సపోర్ట్

బాబాయ్‌కి పూర్తి సపోర్ట్

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ... బాబాయ్ ఎప్పుడు పిలిచినా తాను జనసేన తరుపున పని చేయడానికి సిద్ధమే అని తెలిపారు. ఎన్నికల సమయంలో రామ్ చరణ్ కూడా బాబాయ్‌కి సపోర్టుగా ప్రచారం చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X