రాంచరణ్‌ని ఇబ్బంది పెడుతున్న మెగాస్టార్ టైటిల్!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం అజర్బైజాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. విలన్ గా నటిస్తున్న వివేక్ ఒబెరాయ్, రాంచరణ్ మధ్య బోయపాటి శ్రీను అదిరిపోయే యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాడు. ఈ చిత్ర టైటిల్ కానీ, ఫస్ట్ లుక్ కానీ ఇంకా ప్రకటించలేదు. దీనితో ఫాన్స్ కాస్త నిరాశలో ఉన్నారు. దసరాకు ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా రాంచరణ్ సినిమా సెట్స్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. బోయపాటి కళ్ళు చెదిరే యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదల కాకపోవడంతో అభిమానులు ఇలా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో సంతృప్తి పడుతున్నారు.

Ram Charan, Boyapati film fan made poster goes viral.

స్టేట్ రౌడీ పేరుతో వైరల్ అవుతున్న ఈ పోస్టర్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెగాస్టార్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో స్టేట్ రౌడీ చిత్రం ఒకటి. 1989 లో విడుదలైన స్టేట్ రౌడీ చిత్రం ఘనవిజయం సాధించింది. ఈ టైటిల్ నే రాంచరణ్, బోయపాటి చిత్రానికి కూడా పెడతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

కానీ ఇది ఊహాగానం మాత్రమే. కథకు అనుగుణంగా మాస్ టైటిల్స్ పెట్టడంలో బోయపాటి దిట్ట. మెగాస్టార్ సూపర్ హిట్ సాంగ్స్ కొన్ని రాంచరణ్ రీమిక్స్ చేశాడు. మెగాస్టార్ సినిమా టైటిల్ తో కూడా రాంచరణ్ ఓ సినిమా చేస్తే బావుంటుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే ఈ చిత్ర ఫస్ట్ లుక్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X