నిరీక్షణకు తెర.. రాంచరణ్ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌కు ముహూర్తం ఫిక్స్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం కోసం మెగా అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. సినిమా ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశలో ఉన్నారు. ఎట్టకేలకు అభిమానుల నిరీక్షణకు తెర పడనుంది.
ఈ చిత్ర ఫస్ట్ లుక్, టీజర్ విడుదల వివరాలని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. నవంబర్ 6 అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అదే విధంగా నవంబర్ 9 ఉదయం 10.25 గంటలకు టీజర్ విడుదల చేయనుండడం విశేషం. డివివి దానయ్య భారీ బడ్జెట్ లో రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి అనేక విశేషాలు ఉన్నాయి.
బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఆర్యన్ రాణేష్, స్నేహ కీలకపాత్రల్లో నటిస్తున్నాడు. భరత్ అనే నేనుతో తెలుగు తెరకు పరిచయమైన కైరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి సినిమా విడుదల కానుంది.



Click it and Unblock the Notifications











