రామ్ చరణ్ కూడా బిజీ అయ్యాడు.. వరుసగా 4 సినిమాలు.. ఇప్పట్లో దొరికేలా లేడు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వెండితెరకు చాలా గ్యాప్ ఇచ్చాడు. చివరగా చేసిన వినయవిధేయ రామ ప్రేక్షకుల ముందుకు వచ్చి రేపటితో సరిగ్గా రెండేళ్లు. అప్పుడెప్పుడో మొదటి సినిమా చిరుత తరువాత రాజమౌళి మగధీర కోసం దాదాపు రెండేళ్లు వెయిట్ చేశాడు. అదే హయ్యెస్ట్ గ్యాప్. ఇక ఇప్పుడు కరోనా వల్ల మళ్ళీ కెరీర్ లో బిగ్గెస్ట్ గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది. నిజానికి చెర్రీ నెక్స్ట్ రావాల్సిన నాలుగు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

ముందుగా ఆచార్యతోనే..

ముందుగా ఆచార్యతోనే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మధ్యమధ్యలో ఏడాదికి రెండు రెండు సినిమాలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు కానీ అది వర్కౌట్ కాలేదు. ఇక ఈ సారి 2021లో అభిమానులకు డబుల్ బొనాంజా దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా రామ్ చరణ్ ఎలా అనుకున్నా ఆచార్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే.

రిలీజ్ డేట్ ఫిక్స్..

రిలీజ్ డేట్ ఫిక్స్..

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మొదటిసారి ఒక కీలకమైన పాత్రలో కనిపిస్తున్న రామ్ చరణ్ వెండితెరపై సరికొత్త సర్ ప్రైజ్ ఇస్తాడాని ఆడియెన్స్ నమ్మకంతో ఉన్నారు. ఆచార్య రిలీజ్ డేట్ ఆల్ మోస్ట్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. మే9న మెగాస్టార్ కు అత్యంత ఇష్టమైన రోజున ఆచార్య రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందట. జగదేక వీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్ సినిమాలు ఏడాది గ్యాప్ లో అదే తేదీన వచ్చాయి.

దసరాకు RRR

దసరాకు RRR

ఇక ఇదే ఏడాది పరిస్థితులు అనుకూలిస్తే RRR కూడా రావచ్చని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటిస్తున్న ఆ సినిమాను రాజమౌళి పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక దసరా సందర్భంగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి. ఆ సినిమా తరువాత చరణ్ మరో రెండు ఫ్రెష్ సినిమాల స్పీడ్ పెంచవచ్చని టాక్.

మాస్టర్ దర్శకుడితో..

మాస్టర్ దర్శకుడితో..

మాస్టర్ డైరెక్ట్ లోకేష్ కనగరాజన్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేసే ఛాన్స్ ఉందట. వీరి కాంబినేషన్ లో రాబోయే సినిమాను మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించవచ్చని టాక్. ఇక అంతకుముందే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరితో ఒక కథపై చర్చలు జరిపిన చరణ్ ఆల్ మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అయితే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత అల్లు అరవింద్ నిర్ణతగా ఆ ప్రాజెక్టును ఎనౌన్స్ చేస్తారని సమాచారం.

Recommended Video

Telugu producers Ask For 100% Theatre Occupancy | Filmibeat Telugu
మరో రెండేళ్లు బిజిగానే..

మరో రెండేళ్లు బిజిగానే..

ఇక రామ్ చరణ్ ఈ విధంగా వరుసగా నాలుగు సినిమాలతో బిజిగానే ఉన్నాడు. లోకేష్, గౌతమ్ వంటి టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ తో చేయడానికి ఆల్ మోస్ట్ ఒప్పుకున్నట్లే కాబట్టి 2022 వరకు బిజీగా ఉంటాడని చెప్పవచ్చు. ఇక ఇప్పట్లో కొత్త సినిమాలను ఓకే చేసే ఛాన్స్ కూడా లేదు. ఇక కొత్త సినిమాల అఫీషియల్ అప్డేట్స్ సమ్మర్ లోనే ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X