దటీజ్ రామ్ చరణ్.. సతీసమేతంగా పర్సనల్ స్టాఫ్ కి ఊహించని సర్ప్రైజ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తండ్రి చిరంజీవి నట వారసుడిగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ తేజ్ మొట్టమొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. అతి తక్కువ కాలంలోనే మగధీర లాంటి సినిమా చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. అలా తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను అందించిన రామ్ చరణ్ తేజ్ ఇటీవల ఎన్టీఆర్ తో కలిసి చేసిన RRR సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. అయితే తన తండ్రితో కలిసి తీసిన ఆచార్య సినిమా మాత్రం అంచనాలకు ఏ మాత్రం అందుకోలేకపోయింది.
నటనలోనే కాకుండా వ్యక్తిత్వంలో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్న రామ్ చరణ్ తేజ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సాధారణంగా తన దగ్గర పనిచేసే వ్యక్తులను సొంత మనుషుల్లాగా భావించే రామ్ చరణ్ తేజ తాజాగా తన డ్రైవర్ పుట్టిన రోజున అతనికి కూడా తెలియకుండా కేక్ తెప్పించాడు. కేక్ తెప్పించడమే కాక మిగతా అందరి సమక్షంలో కేక్ కట్ చేయించి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు. రామ్ చరణ్ పర్సనల్ డ్రైవర్ నరేష్ బర్త్ డే సందర్భంగా అతనికి తెలియకుండానే కేక్ తెప్పించిన రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి దగ్గరుండి కేక్ కట్ చేయించి ఒక మరపురాని రోజు గా మార్చేశాడు.

సాధారణంగా ఒక స్టార్ స్టేటస్ కలిగిన హీరో ఈ విధంగా తన డ్రైవర్ కు సర్ ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనుషులంతా ఒక్కటే అని భావించే రామ్ చరణ్ లాంటి వారు ఇలా తమ వద్ద పని చేసే వారిని కూడా తమతో సమానంగా భావిస్తూ వారికి మరపురాని రోజులు అందిస్తున్నారు. రామ్ చరణ్ తమ దగ్గర పనిచేసే వ్యక్తులను కూడా తమ కుటుంబమే అని భావిస్తారని, ఇలాంటి వారలు చాలా అరుదుగా ఉంటారని అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అంజలి, శ్రీకాంత్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత ఇప్పటివరకు మరో సినిమా ఏదీ రామ్ చరణ్ ప్రకటించ లేదు.



Click it and Unblock the Notifications











