విజయ్ దేవరకొండ కోసం మెగా హీరో.. ఇది కదా అసలైన సంబరం అంటే!

టాలీవుడ్‌లో చాలా తక్కువ మంది హీరోలకు మాత్రమే అనతి కాలంలోనే విపరీతమైన ఫాలోయింగ్, క్రేజ్ ఏర్పడింది. అలాంటి వారిలో క్రేజీ గాయ్ విజయ్ దేవరకొండ ఒకడు. హీరోగా పరిచయమైన కొత్తలోనే ఎన్నో హిట్లు కొట్టిన అతడు.. ఈ మధ్య కాలంలో మాత్రం ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో భారీ సక్సెస్ కోసం ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేస్తున్నాడు.

విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న సినిమానే 'ఫ్యామిలీ స్టార్'. కొన్ని నెలల క్రితమే ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను ప్రారంభించేశారు. అప్పటి నుంచి ఏమాత్రం బ్రేకులు లేకుండా దీన్ని జరుపుతూ కంప్లీట్ చేశారు. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌ను కూడా మొదలు పెట్టి కంప్లీట్ చేసుకున్నారు. ఇలా ఇప్పుడు విడుదలకు సిద్ధం చేసేస్తున్నారు.

Ram Charan Chief Guest for Vijay Devarakonda Starrer FAMILY STAR Event

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'ఫ్యామిలీ స్టార్' మూవీని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసేసింది. ఇప్పటికే పలు ఈవెంట్లను కూడా నిర్వహించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ సినిమా హడావిడే కనిపిస్తోన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న 'సైంధవ్' మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ముమ్మరం చేసేసింది. ఈ క్రమంలోనే మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఏప్రిల్ మొదటి వారంలోనే జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తాజాగా న్యూస్ వైరల్ అవుతోంది.

Ram Charan Chief Guest for Vijay Devarakonda Starrer FAMILY STAR Event

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'ఫ్యామిలీ స్టార్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టుగా ఎవరు వస్తారన్న దానిపైనా జోరుగా చర్చలు జరుగుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. దీనికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడట. దీనిపై రెండు మూడు రోజుల్లోనే ప్రకటన రాబోతుందని సమాచారం. చరణ్ ఇప్పుడు దిల్ రాజు బ్యానర్‌లోనే 'గేమ్ చేంజర్' చేస్తున్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా.. 'ఫ్యామిలీ స్టార్' చిత్రంలో మృణాల్ ఠాకూర్, దివ్యాన్షా కౌశిక్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X