సమంతను మరచిపోలేక పోతున్న రాంచరణ్.. ఆ హీరోయిన్స్ పక్కన పెట్టి రామలక్ష్మీపైనే లవ్!
ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా అనేక భాషల్లో కొన్ని ఆన్ స్క్రీన్ జంటలకు ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుంది. అలా హిందీ, తమిళ్ సినిమాల్లో ఎందరో స్టార్ హీరోలు హీరోయిన్స్ ఆడియెన్స్ ని ఎంతగానో అలరించారు. కాగా వారికి ఉన్నట్టే మన తెలుగులో కూడా అనేక జంటలు ఎన్నో సినిమాల్లో నుంచి ఉన్నారు.
కాగా అలాంటి కొన్ని హిట్ అండ్ క్రేజీ జంటల్లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే స్టార్ బ్యూటీ ఇపుడు పాన్ ఇండియా సెన్సేషన్ అయ్యిన సమంతల జంట కూడా ఒకటి. కాగా ఈ ఇద్దరి కలయికలో వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం "రంగస్థలం" కోసం తెలియని తెలుగు ఆడియెన్స్ ఉండరు అని చెప్పాలి. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ చిట్టిబాబుగా సమంత రామలక్ష్మిగా ఎంతలా ఇమిడిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అయితే ఇద్దరి కెమిస్ట్రీ తమలోని నటుల్ని మరో కోణంలో చూపించిందని చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. కాగా సమంతతో చరణ్ చేసిన సినిమా ఇదొక్కటే కాగా లేటెస్ట్ గా తాను నటించిన కో కో స్టార్స్ ఒక్క సౌత్ నుంచే కాదు హిందీ సినిమా నుంచి కూడా ఉన్నారు. వారిలో బాలీవుడ్ బిగ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ అలాగే మరో హాట్ బ్యూటీ కియారా అద్వానీలతో కూడా తాను నటించాడు.
కాగా ఈ ముగ్గరు ప్రస్తావనలో బెస్ట్ నటిగా అనే ప్రస్తావనలో బాలీవుడ్ బ్యూటీస్ కియారా అద్వానీ అలాగే ఇమ్మెన్స్ పెర్ఫామర్ అయినటువంటి ఆలియా భట్ ని కూడా పక్కన పెట్టి తన రామ లక్ష్మికి మాత్రమే చిట్టి బాబు ఓటేశాడు. దీనితో నటిగా సమంత చరణ్ కి ఎంత స్పెషల్ అనేది అర్ధం చేసుకోవచ్చు. కాగా రంగస్థలం తర్వాత మళ్ళీ ఇద్దరు కాంబినేషన్ ని చాలా మంది ఆశించారు కానీ ప్రస్తుతానికి అది ఇంకా సాధ్య పడలేదు.
మరి మళ్ళీ భవిష్యత్తులో ఏమన్నా ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవుతుందో లేదో చూడాలి మరి. కాగా ఇపుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన భారీ సినిమా గేమ్ ఛేంజర్ రిలీజ్ పనుల్లో బిజీగా ఉండగా ఇందులో పైన చెప్పుకున్న కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ఇక సమంత విషయానికి వస్తే తన ఆరోగ్య రీత్యా కొన్నాళ్ల పాటుగా ఆమె బ్రేక్ తీసుకుంది.
కానీ గత ఏడాదిలో తాను నటించిన యాక్షన్ స్పై థ్రిల్లర్ సిరీస్ "సిటాడెల్ హనీ బన్నీ" తో పలకరించింది. అలాగే దీని తర్వాత తుంబాడ్ ఫేమ్ దర్శకుడు అనీల్ రాహి బార్వేతో కలిసి "రక్త బ్రహ్మాండ్" అనే భారీ సిరీస్ ని చేస్తుంది. ఇక ఇది కాకుండా పలు సినిమాలు చేస్తుంది కానీ తెలుగులో మాత్రం ఎలాంటి సినిమాలు ఆమె చేసే ఆసక్తి కనబరచడం లేదట.


Click it and Unblock the Notifications











