ఆ రెండు సినిమాలు 50 సార్లు చూసా.. ఇష్టమైన 4 సినిమాలు అవే.. ఎన్టీఆర్ మూవీ కూడా: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ అనే బ్రాండ్ తో ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. హాలీవుడ్ మీడియా కూడా ఇప్పుడు రామ్ చరణ్ ను ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. RRR సాంగ్ ఆస్కార్ లో నామినేట్ కావడంతో రామ్ చరణ్ ఇమేజ్ ఒక్క పెరిగిపోయింది. హాలీవుడ్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న యుట్యూబర్స్ రామ్ చరణ్ తో ప్రత్యేక ఇంటర్వ్యూలు చేస్తున్నారు. లెటర్ బాక్స్డ్ అనే యుట్యూబ్ చానల్ కి తాజాగా రామ్ చరణ్ లైవ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక అందులో రామ్ చరణ్ తనకు ఇష్టమైన టాప్ హాలీవుడ్ సినిమాల గురించి వివరణ ఇచ్చారు.

ఫేవరేట్ స్టార్స్
ఈ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. ఫేవరేట్ సినిమాల గురించి మొదటి సారి ఓపెన్ అప్ అయ్యారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ స్టార్స్ జూలియా రాబర్ట్స్, కేథరిన్ జేట జోన్స్ అని రామ్ చరణ్ చెప్పాడు. ఇక ఇప్పుడు తన ఫేవరేట్ సినిమాల గురించి రామ్ చరం ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు అన్నాడు.

ఒక్కో సినిమా 50 సార్లు
రామ్ చరణ్ తన ఫేవరేట్ సినిమాలపై మాట్లాడుతూ.. ఫస్ట్ ప్లేస్ లో ది నోట్ బుక్, టెర్మినేటర్ 2 మొదటి రెండు స్థానాలలో ఉంటాయని చెప్పారు. అవి డిస్క్ లో ఉన్నాప్పుడు ఒక్కో సినిమా 50 సార్లకి పైగా చూసి ఉంటానని చెప్పారు. అందులో ప్రతీ సీన్ కూడా ఏదో ఒక విధంగా ఎట్రాక్ట్ చేస్తుందని ముఖ్యంగా ఎమోషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఆకట్టుకుంటాయని అన్నాడు.

ఈ రెండు సినిమాలు కూడా
తరువాత గ్లాడియేటర్ , డైరెక్టర్ టరంటినో సినిమాలు అన్ని కూడా తనకి భాగా నచ్చే సినిమాలే అని రామ్ చరణ్ తెలిపారు. ఈ రెండు సినిమాలు కూడా ఎన్నిసార్లు చూశానో గుర్తు లేదని కాన్ని ఎన్నిసార్లు చూసిన సరికొత్త ఫీల్ కలుగుతుంది అని అన్నాడు. ఇక మంచి కంటెంట్ తో ఏ సినిమా వచ్చినా కూడా ఒకటికి రెండుసార్లు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు.

దాన వీర శూర కర్ణ
ఇక సౌత్ సినిమాలలో అయితే దాన వీర శూర కర్ణ, బాహుబలి సినిమాలతో పాటు తాను నటించిన రంగస్థలం సినిమా తన ఫేవరేట్ సినిమాలుగా ఉన్నాయని పేర్కొన్నారు. అలాగే బాలీవుడ్ లో మిస్టర్ ఇండియా దర్శకుడు శేఖర్ కపూర్ తెరకెక్కించిన సినిమాలు కూడా తనకి భాగా నచ్చుతాయని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పడం విశేషం.

నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ
మొత్తానికి రామ్ చరణ్ ఫేవరేట్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో టాప్ లిస్ట్ లో ఈ హాలీవుడ్ సినిమాలు ఉన్నాయని ఈ ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ వచ్చింది. అలాగే సీనియర్ ఎన్టీఆర్ నటించిన దానవీరసూరకర్ణ సినిమా కూడా తన ఫేవరేట్ సినిమా అని చెప్పడం ద్వారా నందమూరి అభిమానుల మనసుని చరణ్ గెలుచుకున్నాడు. ఇక రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











