రాంచరణ్ ఎంత క్లాస్‌గా ఉన్నాడో.. ఆకట్టుకుంటున్న 'వినయ విధేయ రామ' కొత్త లుక్!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న తాజా చిత్రం వినయ విధేయ రామ. ఈ చిత్రం మాస్ అభిమానులకు పండగ అని టీజర్ తోనే అర్థమైపోయింది. మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బోయపాటి చిత్రాల్లో బలమైన మాస్ అంశాలతో పాటు కొన్ని ఫ్యామిలి ఆడియన్స్‌కు నచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి.
కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయవిధేయ రామ చిత్ర పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో రాంచరణ్ అదిరిపోయే క్లాస్ లుక్‌లో దర్శనం ఇస్తున్నాడు. రాంచరణ్ సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న ఈ పోస్టర్ ఆహ్లాదభరితంగా ఉంది. కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు.. సంక్రాంతికి కలుద్దాం అంటూ చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. టీజర్‌లో రాంచరణ్ పవర్ ఫుల్ లుక్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు.

భరత్ అనే నేను హీరోయిన్ కైరా అద్వానీ రాంచరణ్ కు జోడిగా నటిస్తోంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. రాంచరణ్ రంగస్థలం లాంటి సూపర్ హిట్ తరువాత నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న రాజమౌళి చిత్ర షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమైంది. ప్రస్తుతం వినయ విధేయ రామ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది.


Click it and Unblock the Notifications











