Ram Charan: భార్యకు రామ్ చరణ్ ఖరీదైన గిఫ్ట్.. చూడకుండా అవతల పారేసిన ఉపాసన

RRR మూవీతో వరల్డ్ వైడ్ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటవలే తండ్రిగా ప్రమోషన్స్ కొట్టాడు. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి పండంటి ఆడబిడ్డకు జూన్ 20న అంటే జన్మనిచ్చిన విషయం తెలిసిందే. మెగా ప్రిన్సెస్ కు క్లిన్ కారా అని పేరు కూడా పెట్టారు. ఇక మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంతోషం వెల్లు విరిసింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్-ఉపాసన అండర్ స్టాండింగ్ తోనే పదేళ్ల తర్వాత పిల్లలకు జన్మనిద్దామనుకుని అలాగే చేశారు. అలాంటి అండర్ స్టాండింగ్ ఉన్న ఉపాసనపై తాజాగా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పర్సనల్ టాపిక్స్ : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తండ్రి మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. క్లిన్ కారా రాకతో మెగా కుటుంబం ఆనందోత్సాహంతో నిండిపోయింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. మీషోతో జరిగిన ఇంటర్వ్యూలో అనేకంగా తన పర్సనల్ విషయాలను షేర్ చేసుకున్నాడు. షాపింగ్ చేయడం, గిఫ్టులు ఇవ్వడం వంటి అనేక అంశాలను వెల్లడించాడు.

ramcharanupasana1

అది చాలా ఇష్టం : చిన్నప్పటి నుంచి తన స్టైలింగ్ ను చెప్పడం, ఉపాసన, బన్నీ, తన అక్కా చెల్లెళ్ల గురించి ఎన్నో విషయాలను పంచుకున్న రామ్ చరణ్ తనకు ఆన్ లైన్ షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు. అలాగే ఇతరులకు బహుమతులు ఇవ్వడం అంటే కూడా చాలా ఇష్టమని, అది తన అలవాటు అని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

ramcharanupasana1

చాలా కలెక్షన్ ఉంది : ఇదే ఇంటర్వ్యూలో తనకు వాచ్ లంటే చాలా ఇష్టమని తెలిపాడు చెర్రీ. పటేక్, కేసియో వాచెస్ అంటా మరి ఇష్టమట. కరోనా సమయంలో కేసియో వాచ్ ను ఆర్డర్ పెట్టాడట. అది ఇంటికి వచ్చాకా.. ఓపెన్ చేసినప్పుడు వచ్చిన సంతోషం అంతా ఇంతా కాదంటూ రామ్ చరణ్ ఆసక్తిగా వెల్లడించాడు. తన ఇంట్లో ఇప్పటికే వాచెస్ కలెక్షన్ చాలా ఉందన్నాడు.

ramcharanupasanawithbaby3

సింపుల్ షర్ట్స్ : "సాధారణంగా నేను ఎక్కడికి వెళ్లినా చెక్స్ షర్ట్ వేసుకుని వెళ్లేవాడిని. కానీ, మా సిస్టర్స్ అంతా కూడా ఫ్యాషన్ గురించి చెప్పేవాళ్లు. అది వేసుకోమని, ఇది వేసుకోమని చెప్పేవారు. నేను చిన్నప్పటి నుంచి అలా కజిన్స్, ఆడవాళ్ల మధ్యే పెరిగాను. ఇక పెళ్లయ్యాక గ్రే, వైట్ ఇలా సింపుల్ గా ఉండే షర్ట్స్ వేసుకునే వాడిని" అని రామ్ చరణ్ తెలిపాడు.

ఎలాంటి గిఫ్ట్స్ : "నా ఫ్యాషన్ మార్చమని, నన్ను మార్చమని నా ఫ్యాషన్ డిజైనర్ ఫ్రెండ్స్ తో ఉపాసన చెబుతుండేది. నాకు ఆన్ లైన్ షాపింగ్ ఇష్టం. తక్కువ ధరకు ఎక్కువ ధర ఉండే వస్తువులను వెతుకుతాను" అని రామ్ చరణ్ చెప్పాడు. దీంతో ఆడవాళ్లకు ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలో అబ్బాయిలకు కాస్తా సలహాలు ఇవ్వమని యాంకర్ అడగ్గా తనకు జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు చెర్రి.

ramcharanupasanawithbaby3

అలా చేయొద్దు : "పెళ్లయిన కొత్తలో ఉపాసన కోసం ఓ కాస్ట్ లీ గిఫ్ట్ తీసుకున్నాను. అది తీసుకెళ్లి ఉపాసకు ఇస్తే.. కనీసం ఐదు సెకన్లు కూడా చూడకుండా పక్కన పడేసింది. కానీ, ఆ వస్తువు కొనడానికి నాకు ఐదు గంటలు పట్టింది. అందుకే ఆడవాళ్లకు సర్ ప్రైజ్ లు ఇవ్వొద్దు. వారికి అవి నచ్చకపోవచ్చు. ఏదైనా వాళ్లను అడిగి కొంటే బెటర్" అన్నట్లుగా రామ్ చరణ్ తెలిపాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X