Game Changer: లేటుగా ఫినీష్ చేసిన రామ్ చరణ్.. తెలుగులో తొలి హీరోగా షాకింగ్ రికార్డు

తెలుగు సినిమా పరిశ్రమలోకి వారసులుగా ఎంతో మంది స్టార్ల పిల్లలు వచ్చారు. కానీ, అందులో కొందరు మాత్రమే తండ్రులతో సమానమైన స్థాయికి చేరుకున్నారు. అలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ఒకడు. చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను, మార్కెట్‌ను అందుకున్న అతడు.. RRR సినిమాతో గ్లోబల్ స్టార్‌గానూ ఎదిగిపోయాడు.

ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో ఫామ్‌లో ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు లెజెండీర డైరెక్టర్ ఎస్ శంకర్‌‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్నాడు. దీనికితోడు ఇది పొలిటికల్ థ్రిల్లర్ బ్యాగ్‌డ్రాప్‌తో రాబోతుంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఏర్పడ్డాయో తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో తీస్తున్నారు.

Ram Charan Completes His Shooting Part Of Game Changer Movie

రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 90 శాతం వరకూ మాత్రమే షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయింది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను మళ్లీ ప్రారంభించి శరవేగంగా షూట్ చేస్తున్నారు. ఇలా దీన్ని ఈ ఏడాది చివర్లో తీసుకు రాబోతున్నారు.

పొలిటికల్ థ్రిల్లర్ స్టోరీలైన్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌పై, రిలీజ్ డేట్‌పై ఎన్నో రకాల అంశాలు బయటకు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా చిత్రీకరణ అనుకున్న విధంగా సాగడం లేదు. శంకర్ 'భారతీయుడు 2' సినిమాపై ఫోకస్ చేయడంతో ఇది లేట్ అయింది. అయితే, ఇప్పుడు ఈ చిత్రం నుంచి అదిరిపోయే న్యూస్ లీక్ అయింది.

Ram Charan Completes His Shooting Part Of Game Changer Movie

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నాడు. దీంతో అతడు ఈ చిత్రం నుంచి బయటకు వచ్చేశాడు. ఇక్కడే ఓ ఆసక్తికరమైన అంశం వైరల్ అవుతోంది. అదేమిటంటే.. ఓ పొలిటికల్ మూవీని ఎక్కువ రోజులు షూట్ చేసిన హీరోగా రామ్ చరణ్ షాకింగ్ రికార్డును అందుకున్నాడు. ఈ చిత్రం కోసం అతడు ఏకంగా 2 సంవత్సరాల 10 నెలలు కేటాయించాడట. దీంతో ఇప్పుడిది హాట్ టాపిక్ అవుతోంది.

ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan game changer s shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X