కన్ఫార్మ్ చేసిన చరణ్.. వీడియో పోస్ట్ చేసిన ఉపాసన
మిగిలిన హీరోలతో పోలిస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండడు. అందుకే అతడికి ఫేస్‌బుక్ ఖాతా తప్ప మరొకటి లేదు. ప్రస్తుత తరం హీరోలందరూ సోషల్ మీడియా ద్వారా దూసుకుపోతుంటే.. చెర్రీ మాత్రం సైలెంట్‌గా ఉండిపోయాడు. దీంతో ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసేవారు. దీన్ని అర్థం చేసుకున్న చరణ్.. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ
అభిమానులు, సన్నిహితులతో నిత్యం టచ్‌లో ఉండేందు కోసం రామ్ చరణ్ మరో ప్రయత్నం చేశాడు. అదే.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా ఓపెన్ చేయడం. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ‘always ram charan' పేరుతో ఈ సామాజిక మాధ్యమంలోకి అడుగు పెట్టాడు ఈ మెగా హీరో. దీంతో అభిమానులు తెగ ఖుషీ అయిపోతున్నారు.
వీడియో విడుదల చేసిన ఉపాసన
రామ్ చరణ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడన్న విషయం అందరికీ తెలిసిందే అయినా.. అతడే స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఈ మేరకు స్విమ్మింగ్ పూల్‌లో నుంచి మాట్లాడుతున్న ఓ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘ఫైనల్‌గా నేను ఇన్‌స్టాలోకి వచ్చాను. మీ అందరితో టచ్‌లో ఉండేందుకు ఇది మంచి ఫ్టాట్‌ఫాం. ఇది నాకు కొత్త. మిమ్మల్ని అక్కడ కలుసుకోవడం ఆనందంగా ఉంది'' అంటూ చెప్పుకొచ్చాడు.

గంటగంటకూ పెరిగిపోతున్న ఫాలోవర్స్
చెర్రీ ఇన్‌స్టాలోకి ఎంటరైనప్పటి నుంచి గంటగంటకు ఫాలోయర్స్ పెరిగిపోతున్నారు. ఆయన ఫ్యాన్స్ ఈ విషయాన్ని అందరికీ తెలియజేయడంతో ఇప్పటికే రామ్ చరణ్ ఫాలోవర్స్ రెండున్నర లక్షలకు పైగా పెరిగిపోయారు. ఫ్యాన్స్‌తో పాటు సెలెబ్రిటీలు కూడా చరణ్‌ను ఫాలో అవుతున్నారు. ప్రస్తుతానికి రామ్ చరణ్‌ను ఫాలో అవుతోన్న సెలబ్రిటీల్లో సాయి ధరమ్ తేజ్, అఖిల్ అక్కినేని ఉన్నారు. అయితే, చెర్రీ మాత్రం ఎవరీ ఫాలో అవడం లేదు.

ప్రస్తుతం చేస్తున్న సినిమా
రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి ‘RRR'లో నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో చరణ్ అల్లూరు సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2020 జూలై 30న విడుదల కాబోతోంది.


Click it and Unblock the Notifications











