Ram Charan చిన్నారి అభిమానికి రాంచరణ్ ఓదార్పు.. ఫ్యాన్స్ మనసు దోచుకొన్న మెగా పవర్ స్టార్
RRR చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ సంపాదించుకొంటున్న నేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన రాంచరణ్ పేరు ఇప్పుడు అన్ని దేశాల్లో మార్మోగున్నది. అమెరికాలో మెగా పవర్ స్టార్‌కు విశేషంగా అభిమానులు పెరిగిపోయారు. తాజాగా రాంచరణ్ అమెరికాలో పర్యటిస్తూ మరింత మంది అభిమానులకు చేరువయ్యారు. అయితే ఓ చిన్నారి అభిమాని కోసం రాంచరణ్ చూపిన ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అమెరికాలో జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షోలో
అమెరికాలో పాపులర్ టాక్ షో గుడ్ మార్నింగ్ అమెరికాలో పాల్గోనాలని మెగా హీరో రాంచరణ్‌కు ఆహ్వానం అందుకొన్నది. ఇండియాలో ఈ ఆహ్వానాన్ని అందుకొన్న తొలి హీరో రాంచరణ్ కావడం విశేషంగా మారింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏబీసీ స్టూడియోకు వెళ్లిన రాంచరణ్‌కు భారతీయ అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఆయనతో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు.
ఘన స్వాగతం పలికిన మెగా ఫ్యాన్స్
అయితే ఏబీసీ స్టూడియోలోకి వెళ్లే ముందు ఘన స్వాగతం పలికిన అభిమానులు.. ఆయన తిరిగి వచ్చేంత వరకు వేచి చూశారు. గుడ్ మార్నింగ్ అమెరికా టాక్ షో షూట్ ముగిసిన వెంటనే ఆయన బయటకు రాగానే అదే జోష్ కనిపించింది. తన కోసం వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేసి.. తిరిగి వెళ్తుండగా.. ఫోటో కోసం ప్రయత్నించిన చిన్నారి అభిమాని కంటతడి పెట్టింది. తాను ఫోటో తీసుకోలేకపోయానే అనే ఏడుస్తున్నారనే విషయం రాంచరణ్‌కు తెలిసింది.
చిన్నారి అభిమాని మనస్తాపం.. రాంచరణ్ బుజ్జగింపు
తనతో ఫోటో తీసుకోలేకపోయాననే బాధతో ఉన్న చిన్నారి అభిమాని వద్దకు రాంచరణ్ వెళ్లి.. ఆ పాపను ఓదార్చారు. ఏడుస్తుండగా.. ఆమెకు ఉపశమనం కలిగించేలా మాటలు చెప్పి ఆ చిన్నారితో ఫోటో దిగాడు. చిన్నారిని బుజ్జగించేందుకు ప్రయత్నించిన సంఘటనలను ఓ నెటిజన్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యాయి.

సోషల్ మీడియాలో మనసు దోచుకొన్న మెగా పవర్ స్టార్
నెటిజన్ షేర్ చేసిన ఫోటోలో చిన్నారితో రాంచరణ్ అప్యాయంగా మాట్లాడే తీరు, అలాగే ప్రేమగా షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిన తీరు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి. అలాగే రాంచరణ్ వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు వెల్లువెత్తతున్నాయి.

క్రిటిక్ ఛాయిస్ అవార్డు కోసం రాంచరణ్
ఇదిలా ఉండగా, క్రిటిక్ ఛాయిస్ సూపర్ అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరిలో అవార్డు కోసం రాంచరణ్, ఎన్టీఆర్ పోటీ పడుతున్నారు. ఈ అవార్డు రేసులో టామ్ క్రూయిజ్, నికోలాస్ కేజ్, బ్రాడ్ పిట్ లాంటి వాళ్లు ఉండటం పోటీ రసవత్తరంగా మారింది. అలాగే రాంచరణ్, ఎన్టీఆర్‌పై చిత్రీకరించిన నాటు నాటు పాట ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











