RC15లో రామ్ చరణ్ అద్భుతం.. అంతసేపు ఆగకుండా డ్యాన్స్.. 'నాటు నాటు' పాటను మించుతుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR సినిమా ద్వారా దేశవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. రౌద్రం రణం రుధిరం సినిమా అనేక అవార్డులను కొల్లగొట్టింది. ఎమ్ఎమ్ కీరవాణి మ్యాజికల్ మ్యూజిక్ గా వచ్చిన ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో అదరగొట్టిన చెర్రీ నటనకు యావత్ ప్రపంచమే ప్రశంసల జల్లులు కురిపించింది. ఇప్పుడు రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో RC15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులోని ఓ పాటకు ఆగకుండా డ్యాన్స్ వేసిన చెర్రీని చూసి శంకర్ ఆశ్చర్యపోయారట. అంతేకాకుండా ఆ పాటలో రామ్ చరణ్ చేసిన డ్యాన్స్ సమయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

నటన గురించి ప్రపంచమే..

నటన గురించి ప్రపంచమే..

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతతోనే ఎంతో ఆకట్టుకున్నాడు. అందులో చెర్రీ నటన, డ్యాన్సులకు మెగా అభిమానులు ఫిదా అయిపోయారు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యాజికల్ మ్యూజిక్ కి చెర్రీ స్టెప్పులు అలరించాయి. రెండో సినిమాగా వచ్చిన మగధీరతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ మెగా పవర్ స్టార్. ఇక గతేడాది మార్చిలో వచ్చిన RRR సినిమాతో తన నటన గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకునేలా చేశాడు.

వివాహం సందర్భంగా..

వివాహం సందర్భంగా..

RRR వంటి సక్సెస్, ఆచార్య సినిమా ఫ్లాప్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న లేటేస్ట్ మూవీ RC15. ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమాకు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాతో చెర్రీ సరసన రెండోసారి నటిస్తోంది కియారా అద్వానీ. ఇటీవల ఆమె వివాహం సందర్భంగా మూవీ యూనిట్ అంతా కలిసి విష్ చేశారు.

 సుమారు 10 రోజులపాటు..

సుమారు 10 రోజులపాటు..

ఇప్పటివరకు శరవేగంగా జరిగిన RC15 మూవీ షూటింగ్ ప్రస్తుతం కొంతకాలం వాయిదా పడనుంది. ఎందుకంటే శంకర్ డైరెక్ట్ చేస్తున్న మరో మూవీ ఇండియన్ 2 కోసం ఒక నెల రోజులపాటు ఆయన చెన్నై వెళ్లనున్నారట. కానీ ఇప్పటివరకు రామ్ చరణ్ RC15 కీలక సన్నివేశాలు, పాటలు చిత్రీకరించారు డైరెక్టర్ శంకర్. ఓ సాంగ్ కోసం న్యూజిలాండ్ వెళ్లిన RC15 చిత్రబృందం సుమారు 10 రోజులపాటు ఈ పాటను చిత్రీకరించాని సమాచారం.

వివిధ ప్రాంతాల్లో..

వివిధ ప్రాంతాల్లో..

న్యూజిలాండ్ లో చిత్రీకరించిన ఈ ఒక్కపాట కోసం రూ. 8 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు వార్తలు వినిపించాయి. అలాగే హైదరాబాద్ పాతబస్తీ, రాజమండ్రి, వైజాగ్ లలో కూడా ఒక సాంగ్ షూట్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో రామ్ చరణ్ మీద సోలో సాంగ్ కు సంబంధించిన షూటింగ్ చేసినట్లు టాక్. కొండారెడ్డి బురుజు వద్ద తండ్రి పాత్రలో రామ్ చరణ్ చేస్తున్న పాటన షూటింగ్ చేశారు. ఇంకా వైజాగ్ గీతం యూనివర్సిటీలో చెర్రీ కలెక్టర్ పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ సాంగ్ చిత్రీకరించారు.

సినిమాకే హైలెట్ గా..

సినిమాకే హైలెట్ గా..

దిల్ రాజు, శిరీష్ రూ. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు RC15 సినిమాలో పాటలను చాలా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు శంకర్. ఇప్పుడు తాజాగా చిత్రీకరించే పాట కోసం రూ. 5 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారట. ఈ పాటలో రామ్ చరణ్ తన డ్యాన్స్ తో అబ్బురపరిచాడట. సుమారు 80 సెకన్ల పాటు చేసిన ఈ డ్యాన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనుందని అంటున్నారు. సింగిల్ టేక్ లోనే రామ్ చరణ్ అదరగొట్టాడని సమాచారం.

 నాటు నాటును మించేనా..

నాటు నాటును మించేనా..

ఇక చెర్రీ చేసిన డ్యాన్స్ ను డైరెక్టర్ శంకర్ అలానే చూస్తూ ఉండిపాయరట. అంటే మరోసారి రామ్ చరణ్ తన డ్యాన్స్ తో రికార్డ్ క్రియేట్ చేయనున్నాడని టాలీవుడ్ టాక్. ఇంతకుముందు RRR సినిమాలో చెర్రీ, తారక్ కలిసి డ్యాన్స్ చేసిన నాటు నాటు పాట ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇందులో వీళ్లిద్దరు కలిసి స్టెప్పుకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డుతోపాటు ఆస్కార్ ఒరిజనల్ సాంగ్ కేటగిరీకి నామినేట్ కూడా అయింది. ఇప్పుడు RC15లో చెర్రీ డ్యాన్స్, పాట నాటు నాటుకు మించుతుందా అని చర్చించుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X