G20 summit సదస్సులో స్టెప్పులేసిన రాంచరణ్.. కొరియన్ అంబాసిడర్‌తో నాటు నాటు డ్యాన్స్!
జమ్ము, కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులు భారీగా హాజరయ్యూ ఈ సదస్సు మే 22 నుంచి మూడు రోజుల పాటు అంటే మే 24వ తేదీ వరకు జరుగుతాయి. ఈ వేడుకలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆయన సదస్సులో మాట్లాడుతూ..

టూరిజం డెవలప్‌మెంట్, ఇండియాలో పర్యాటక అభివృద్ధి అంశాల లక్ష్యంగా నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సు కోసం రాంచరణ్ సోమవారం ఉదయం శ్రీనగర్‌కు చేరుకొన్నారు. సోమవారం ఉదయం నిర్వహించిన సదస్సులో కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బాక్‌తో కలిసి పాల్గొన్నారు.

రాంచరణ్ సదస్సులో మాట్లాడుతూ.. నా హృదయంలో కశ్మీర్‌కు మంచి స్థానం ఉంది. 1986 నుంచి నేను ఇక్కడికి వస్తున్నాను. గుల్మార్గ్, సోనామార్గ్ ప్రాంతాల్లో మా నాన్న చిరంజీవి గారు చాలా సార్లు షూటింగ్ చేశారు. 2016లో ఇదే ఆడిటోరియంలో నా సినిమా షూటింగ్ జరిగింది. ఈ ప్రదేశం ఓ మ్యాజిక్. కశ్మీర్‌కు రావడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొనే ప్రకృతి అందాలు కశ్మీర్‌కు సొంతం అని రాంచరణ్ అన్నారు.

జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సదస్సులో భాగంగా రాంచరణ్ నాటు నాటు పాటకు స్టెప్పులేయగా సోషల్ మీడియాలో వీడియో క్లిప్పింగ్ వైరల్‌గా మారింది. కొరియన్ అంబాసిడర్ చాంగ్ జే బాక్ కోరిక మేరకు రాంచరణ్ ఆయనకు స్టెప్పులు నేర్పించారు. ఆ తర్వాత లయబద్దంగా నాటు నాటుకు స్టెప్పులేసి ఆకట్టుకొన్నారు.
ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం నిర్వహిస్తున్న జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశానికి ఇప్పటికే డెలిగేట్లు శ్రీనగర్‌కు చేరుకొన్నారు. శ్రీనగర్‌కు వెళ్లే దారి పొడుగునా జీ20 లోగోలను ఏర్పాటు చేశారు. వీధులను, రోడ్లను సుందరీకరించారు. శ్రీనగర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ వరకు రోడ్డు పొడుగునా టూరిజానికి సంబంధించిన బ్యానర్లతో అలంకరించారు.


Click it and Unblock the Notifications











