RC16: రామ్ చరణ్‌కు రికార్డు పారితోషికం.. RC16 సినిమాకి రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!

ప్రస్తుతం తెలుగు సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ హీరోస్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఒకడు. తన సినిమాలు ప్లాప్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మినిమమ్ మంచి వసూళ్లు అందుకునే స్టామినా తన సొంతం. కాగా ఇపుడు సరిగా ఇదే లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్ కి కూడా కనిపిస్తుంది. కాగా చరణ్ నటించిన ఈ సినిమా జెనరల్ ఆడియెన్స్ నుంచి టాక్ డీసెంట్ గానే వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో గతంలో ఏ సినిమాకి చూడని భారీ నెగిటివిటీ అలాగే పైరసీ చూడాల్సి వచ్చింది.

ఇలా రామ్ చరణ్ కెరీర్ లో కూడా ఈ సినిమా ఫలితం అనుకున్న రేంజ్ లో వచ్చేలా లేదు అన్నట్టుగా పరిస్థితి మారింది. ఈ నేపథ్యంలో చరణ్ మార్కెట్ ఏమన్నా క్రాష్ అవుతుందా తన తదుపరి సినిమాల పరిస్థితి ఏంటి అనేది కూడా ఇపుడు సినీ వర్గాల్లో చర్చకి దారి తీసింది. కాగా గేమ్ ఛేంజర్ ఎఫెక్ట్ ఐతే ఇపుడు రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాలకి ఏమాత్రం లేదని తెలుస్తుంది.

ram charan demand is huge even after game changer record remuneration for next

కాగా తన నెక్స్ట్ సినిమా అయినటువంటి RC 16 ప్రాజెక్ట్ కి అతడు రికార్డు రెమ్యునరేషన్ ని కూడా తీసుకుంటున్నట్టుగా ఇపుడు తెలుస్తుంది. కాగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకే 70 నుంచి 100 కోట్ల రెమ్యునరేషన్ ని తీసుకున్నట్టుగా సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే ఈ సినిమా అనుకున్న అంచనాలు అందుకోకపోయినప్పటికీ తన నెక్స్ట్ సినిమాకి ఏకంగా అంతకు మించి డబుల్ రెమ్యుననరేషన్ ని అందుకుంటున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

అంటే బుచ్చిబాబు సినిమా కోసం ఏకంగా 200 కోట్లకి పైగా తాను పారితోషికం అందుకుంటున్నాడని తెలుస్తుంది. దీనితో ఆ సినిమా ఎఫెక్ట్ దీని విషయంలో మాత్రం పెద్దగా లేదని చెప్పాలి. కాగా ఈ సినిమాని కూడా గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తుండగా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సానా పవర్ఫుల్ సబ్జెక్టుగా దీనికి ప్లాన్ చేసాడు.

ram charan demand is huge even after game changer record remuneration for next

అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే లెజెండరీ సంగీత దర్శకుడు ఆస్కార్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తుండగా కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ తదితర స్టార్ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక లేటెస్ట్ గా చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాని ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా ఈ సినిమాని ఏకంగా 500 కోట్ల మేర బడ్జెట్ తో దిల్ రాజు నిర్మాణం వహించారు.

తమ బ్యానర్ లో 50వ సినిమాగా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసారు కానీ ఈ సినిమా దిల్ రాజుకి తీవ్ర నష్టాలు మాత్రమే మిగిల్చిన సినిమాగా నిలిచిపోయింది. మరి ఈ నష్టాల విషయంలో చాలా కామెంట్స్ వస్తున్నాయి అలాగే రామ్ చరణ్ అభిమానులు కూడా చిత్ర టీం, దర్శకుడు శంకర్ విషయంలో కూడా డిజప్పాయింట్ గా ఉన్నారు.

More from Filmibeat

Read more about: game changer ram charan shankar
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X