Ayodhya Ram Mandir రాముడి 500 ఏళ్ల వనవాసం ముగిసింది.. అయోధ్యలో రాంచరణ్ ఎమోషనల్

అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అద్బుత వేడుకగా జరిగింది. బాల రాముడి విగ్రహానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాణ ప్రతిష్ట చేశారు. అనంతరం ఈ వేడుకను వీక్షించడానికి వచ్చిన ప్రముఖులకు దర్శన భాగ్యం కలిగించారు. ఈ క్రమంలో బాల రాముడి విగ్రహాన్ని రాంచరణ్ దర్శించుకొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో మెగా పవర్ స్టార్ మాట్లాడుతూ..

రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం వచ్చాను. చాలా అద్బుతమైన, అందమైన అనుభూతి. జీవితంలో ఒకేసారి లభించే గొప్ప అపూర్వ ఘట్టాన్ని చూశాను. ఇలాంటి అద్బుతమైన సన్నివేశాన్ని చూడటం గొప్ప గౌరవం. ఇండియాలో పుట్టి ఇలాంటి గొప్ప సంఘటనకు సాక్షిగా నిలవడం మరిచిపోలేని అనుభూతి. నాకు లభించిన గొప్ప వరంగా భావిస్తాను. రాముడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకొంటాను అని రాంచరణ్ అన్నారు.

Ram Charan Emotional Comments about ram mandir inauguration in Ayodhya By Narendra Modi

అంతకుముందు జాతీయ మీడియాతో రాంచరణ్ మాట్లాడారు. 500 ఏళ్ల క్రితం చరిత్రలో ఏం జరిగిందో.. దానిని ఇప్పుడు మన ముందు సాక్షంగా నిలబడింది. 500 ఏళ్ల రాముడి వనవాసం ముగిసి అయోధ్యకు వచ్చారు అని రాంచరణ్ అన్నారు. ఇలాంటి వేడుకలో పాల్గొనడం గొప్పగా గర్వంగా ఉంది. ఇది ఒక వరంలా అనిపిస్తున్నది అని అన్నారు.

దేశవ్యాప్తంగా టీవీలు, సోషల్ మీడియాలో చూస్తున్న వారు అద్వితీయమైన ఘటాన్ని ఆస్వాదించండి. చరిత్రలో అరుదైన ఘట్టం. ఈ వేడుకను ఆస్వాదించండి. శ్రీరాముడి దీవెనలు పొందండి. జై శ్రీరాం అంటూ రాంచరణ్ జాతీయ మీడియాతో మాట్లాడారు.

Ram Charan Emotional Comments about ram mandir inauguration in Ayodhya By Narendra Modi

అయోధ్య పర్యటనకు ముందు చిరంజీవి నివాసానికి పెద్ద ఎత్తున్న అభిమానులు తరలి వచ్చారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు వెళ్తున్న రాంచరణ్, చిరంజీవి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు అభిమానులు రాముడి చిత్ర పటాలను బహుకరించారు. అనంతరం జనవరి 22వ తేదీ ఉదయం బేగంపేట నుంచి అయోధ్యకు బయలుదేరి వెళ్లారు. వారికి అక్కడ భారీగా స్వాగతం లభించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X