రామ్ చరణ్ తప్పించుకున్న భారీ డిజాస్టర్.. రవితేజను వెంటాడిన మూవీ ఏంటో తెలుసా?
Ram charan: సినిమా సక్సెస్ కావాలంటే ముందుగా స్టోరీ బాగుండాలి. అయితే, కొంత మంది స్టార్ హీరోస్ కథల ఎంపిక ప్రత్యేకమైన జడ్జిమెంట్ ఉందని ఇండస్ట్రీలో భావిస్తారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కథ విని వర్కవుట్ అవుతుందంటే.. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది. ఆయన నో చెప్పిన కథలు తర్వాత పెద్దగా ఆడలేదని కూడా సినీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో చిరంజీవి సూచించిన మార్పులు, బెటర్మెంట్స్ చేసి తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర హిట్స్ గా మారిన ఉదాహరణలు కూడా ఉన్నాయి.
అదే తరహా కథల ఎంపిక జడ్జిమెంట్ ఇప్పుడు ఆయన వారసుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూడా వచ్చిందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. సాధారణంగా చిరంజీవి, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలకు కథ చెప్పాలంటే దర్శకులు, రచయితలు పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ఒక కథ నేరుగా స్టార్ హీరో దగ్గరకు వెళ్లే వరకు చాలా దశల్లో ఫిల్టర్ అవుతుంది.

అన్ని దశలు దాటుకుని, ఒక కథ రామ్ చరణ్ వరకు చేరుతుందంటే అందులో కొంత విషయం ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఆ కథ తన ఇమేజ్‌కు, మార్కెట్‌కు, కెరీర్ ప్లాన్‌కు సరిపోతుందా లేదా అన్నది హీరోలు జాగ్రత్తగా పరిశీలిస్తారు. ఆ కారణంగానే కొన్నిసార్లు మంచి కథలు కూడా రిజెక్ట్ అవుతాయి. అదే సమయంలో కొన్ని కథలు తర్వాత ఇతర హీరోలతో తెరకెక్కి ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి ఉదాహరణల్లో నేల టికెట్ ఒకటి. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ ఈ కథను మొదట రామ్ చరణ్‌కు వినిపించినట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపించింది. అప్పట్లో ఈ కథకు 'సన్ ఆఫ్ శంకర్ దాదా'(Son of Shankar Dada) అనే టైటిల్ కూడా ఆలోచించినట్లు ప్రచారం జరిగింది. కథలోని హీరో క్యారెక్టర్ చరణ్‌కు నచ్చినప్పటికీ, కథలో ఇంకా కొన్ని మార్పులు చేయాలని ఆయన సూచించినట్లు చెబుతారు. దర్శకుడు ఆ సూచనల ప్రకారం కథలో మార్పులు చేసినప్పటికీ, చివరకు వచ్చిన ఫైనల్ వెర్షన్ మాత్రం చరణ్‌ను పూర్తిగా కన్విన్స్ చేయలేకపోయిందని సమాచారం.
దీంతో ఆయన ఆ ప్రాజెక్ట్‌ను చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత అదే కథ మాస్ మహారాజా రవితేజ దగ్గరకు వెళ్లింది. చివరకు అదే కథతో 'నేల టికెట్' పేరుతో తెరకెక్కించారు. భారీ అంచనాల మధ్య 2018లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. విమర్శకుల నుంచి కూడా మిక్స్డ్ టాక్ రావడంతో సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో రామ్ చరణ్ అప్పట్లో తీసుకున్న నిర్ణయం సరైనదే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చరణ్ కొన్ని ఇతర ప్రాజెక్టులను కూడా రిజెక్ట్ చేసినట్లు చెబుతారు. మెరుపు, అగ్నిపథ్ రీమేక్, అలాగే నిర్మాత అల్లు అరవింద్ ప్లాన్ చేసిన రామాయణం వంటి ప్రాజెక్టులు కూడా ఆయన చేయలేదని టాక్ వినిపించింది. కొందరు స్టార్ దర్శకుల ఆఫర్లను కూడా చరణ్ తిరస్కరించినట్లు చెబుతారు. ప్రస్తుతం రామ్ చరణ్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. కథ నచ్చకపోతే దర్శకులకు నేరుగా చెప్పేస్తారని, తన సినిమా కారణంగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదనే ఆలోచనతోనే నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు.
ఇదిలా ఉంటే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మూవీ 'పెద్ది'(Peddi). ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్, పాటలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది. 1980ల నాటి గ్రామీణ నేపథ్యంతో సాగే ఈ కథలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమ్మన్ ఇరానీ వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎటువంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!


Click it and Unblock the Notifications











