#RamCharanForOscars ఆస్కార్ జాబితాలో రాంచరణ్ పేరు.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా!
మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరోసారి ఇంటర్నేషనల్ మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించారు. ఆస్కార్ అవార్డుల బరిలో రాంచరణ్ ఉన్నారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్ఎస్ రాజమౌళి రూపొందించిన RRR మూవీలో రాంచరణ్ పోషించిన పాత్రకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించాయి. ఈ సినిమాలో రాంచరణ్ మెచ్యురిటీ పెర్ఫార్మెన్స్ అందర్నీ ఆకట్టుకొన్నది. అయితే ఈ సినిమాను ఆస్కార్ బరిలోకి దించడం తెలిసిందే. అయితే ఈ అవార్డుల జాబితాలో రాంచరణ్ పేరు ఉందనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్'గా మారింది. ఈ వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలు
RRR సినిమా విషయానికి వస్తే.. ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హాలీవుడ్ నుంచి భారీ రెస్సాన్ వచ్చింది. ఆరోన్ స్టీవార్ట్ ఆన్ లాంటి ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సినిమా టేకింగ్, రాజమౌళి దర్శకత్వం ప్రతిభ క్రిటిక్స్ జేజేలు పలుకుతున్నారు.

RRR ఆస్కార్ నామినేషన్స్
2023 అకాడమీ అవార్డుల వ్యవహారం ఇప్పుడు ప్రపంచ సినిమా దృష్టిపడింది,. ఈ అవార్డు కోసం బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్; బెస్ట్ ఒరిజినల్ సాంగ్ (దోస్తి), బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో RRR సినిమాకు నామినేషన్ల పంపారు. ఈ కేటగిరిలో నామినేషన్లు లభించే అవకాశం ఉంది.

రాంచరణ్ పేరు ప్రిడిక్షన్ లిస్టులో
2023లో ఆస్కార్ అవార్డుల నామినేషన్ ప్రకటనకు ముందు Ram Charan for Oscars అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతున్నది. ఇండియా నుంచి ఆస్కార్ అవార్డుల అంచనా జాబితాలో తొలి హీరోగా రాంచరణ్ పేరు ఉంది అని ఫ్యాన్స్ ట్వీట్ చేశారు. రాంచరణ్ ఫ్యాన్ ఈ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేయడంతో ఈ వార్త వైరల్ అయింది.

రాంచరణ్‌తోపాటు ఇతర ప్రముఖులు
ఆస్కార్ అవార్డుల ప్రిడిక్షన్ జాబితాలో రాంచరణ్ పేరు 36 నెంబర్‌గా ఉంది. ఆ తర్వాత డివోషన్ సినిమాకు జోనాథన్ మేజర్స్, క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ సినిమాకు విగ్గో మార్టేసన్ పేరు. రేమండ్ అండ్ రే చిత్రానికి ఈవాన్ మెగ్రేగర్ పేర్లు అందులో హైలెట్‌గా ఉండటంతో అభిమానులు ఆనందంతో ఊగిపోయారు.


Click it and Unblock the Notifications











