RRR : టీంని ఇంటికి పిలిపించి స్వీట్ షాక్ ఇచ్చిన రామ్ చరణ్ .. ఊహించని బహుమతి!
రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం RRR పరిధి లేకుండా రికార్డులు బద్దలు కొడుతూ ముందుకు వెళుతోంది. ఎన్నో వాయిదాల అనంతరం మార్చి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు అడ్డే లేదా అనే విధంగా ముందుకు వెళుతోంది. ఈ సినిమా సక్సెస్ ను సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తేజ మాత్రం తన బంగారు మనసు చాటుకున్నారు.. ఈ సినిమా లో భాగమైన కొందరికి ఆయన బంగారు కానుక ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

రాజమౌళి దర్శకత్వంలో
జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్‌లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన సినిమానే RRR. భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ మల్టీస్టారర్ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్.. కొమరం భీం పాత్రల్లో కనిపించగా రామ్ చరణ్ సరసన ఆలియా భట్, ఎన్టీఅర్ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు.

భారీ స్థాయిలో కలెక్షన్లు
RRR సినిమా తొమ్మిదో రోజైన శనివారం భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టింది. 9 రోజుల్లోనే ఏపీ తెలంగాణలో RRR మూవీకి రూ. 215.60 కోట్లు షేర్ వచ్చింది. అలాగే, కర్నాటకలో రూ. 32.05 కోట్లు, తమిళనాడులో రూ. 30.10 కోట్లు, కేరళలో రూ. 8.95 కోట్లు, హిందీలో రూ. 80.10 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 5.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 79.50 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా 9 రోజుల్లోనే రూ. 452 కోట్లు షేర్, రూ. 820 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది.

35 మంది విభాగ అధిపతులను
ఈ సినిమా రెండు రాష్ట్రాల్లో కలిసి ఆరోజు ఏకంగా రూ. 19.62 కోట్లు రాబట్టింది. బాహుబలికి అప్పట్లో కేవలం రూ. 6.51 కోట్లు మాత్రమే వచ్చాయి. అలా ఈ సినిమా ఇంతలా రికార్డులు బద్దలు కొడుతోంది. ఇక రామ్ చరణ్ తేజ ప్రస్తుతం అయ్యప్ప మాల ధారణ చేశారు. సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఆదివారం ఉదయం నాడు ఆయన సినిమా కోసం పనిచేసిన దాదాపు 35 మంది విభాగ అధిపతులను అల్పాహారం కోసం ఇంటికి పిలిపించుకున్నారు.

ఒక్కొక్కరికీ తులం బంగారం
ఒక్క విభాగం అని కాకుండా దాదాపు సినిమాలో పనిచేసిన అన్ని విభాగాలకు చెందిన ముఖ్యమైన వారిని ఇంటికి పిలిపించుకుని రామ్ చరణ్ వారందరితో అల్పాహారం చేసి సమయం గడిపారు. అయితే సాధారణంగా సినిమా సక్సెస్ అయిన తరువాత ఇలా హీరోలు ఇంటికి పిలిపించుకుని చిన్న గిఫ్ట్ ఇవ్వడం సాధారణమే అనుకున్నారు ఆ స్టాఫ్ అంతా. అయితే అల్పాహారం అయిపోయిన తర్వాత రామ్ చరణ్ వాళ్లు అందరినీ పిలిపించి ఒక్కొక్కరికీ తులం బంగారం అంటే దాదాపు పది గ్రాముల బంగారం బహుమతిగా ఇచ్చారు.
Recommended Video


రామ్ చరణ్ బంగారం
దానితో పాటు కేజీ స్వీట్లు కూడా వారికి బహుమతిగా అందజేయడమే కాక సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మీ కృషి కూడా చాలా ఉందని చెబుతూ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఇక రామ్ చరణ్ తేజ వారికి బంగారు నాణేలు ఇస్తున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ క్రమంలో మా రామ్ చరణ్ బంగారం అంటూ మెగా అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











