గడ్డకట్టే మంచులో రామ్ చరణ్.. స్పెషల్ ట్రిప్ ఫినిష్.. ఇక RRR డోస్ పెంచాల్సిందే!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన సతీమణి ఉపాసనతో కలిసి ప్రత్యేకంగా వెకేషన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. ఏ మాత్రం గ్యాప్ దొరికినా తన సతీమణితో కలిసి మంచి ఫ్యామిలీ టైమింగ్ ఎంజాయ్ చేసే రామ్ చరణ్ తేజ్ మరొకసారి ఎలాంటి పనులు పెట్టుకోకుండా భార్యతో కలిసి ప్రైవేట్ జెట్ లో ప్రత్యేకమైన ప్లేస్ కు వెళ్ళాడు. ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఒక ప్రత్యేకమైన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది గడ్డకట్టే మంచులో రామ్ చరణ్ తేజ్ ఫ్లైట్ ఎక్కుతూ కనిపిస్తున్నాడు.

మొత్తానికి హాలిడే ట్రిప్ అయితే పూర్తి చేసుకున్న రామ్ చరణ్ తేజ్ మళ్లీ పనిలో బిజీ అయ్యేందుకు ఇండియా రాబోతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ గా RRR ప్రమోషన్స్ కంటిన్యూ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా ఆలస్యం అయ్యాయి. రాధే శ్యామ్ కోసం దర్శకుడు రాజమౌళి కాస్త ఆలస్యం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక మరో సారి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ తో కలిసి గ్యాప్ లేకుండా ఇంటర్వ్యూలతో బిజీబిజీగా కనిపించబోతున్నారు. గతంలో కంటే ఈ సారి మరింత ఎక్కువగా ప్రమోషన్స్ డోస్ పెంచాలి అని చూస్తున్నారు.

ram charan happy family vacation finished and getting ready to RRR promotions

RRR సినిమాలో రామ్ చరణ్ తేజ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఇక కొమరం భీమ్ పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు. ఇద్దరు కలిసి నటించడంతో ఒకవైపు మెగా హీరోల్లో మరొకవైపు నందమూరి అభిమానుల్లో అంచనాలు స్థాయి అమాంతంగా ఆకాశాన్ని దాటేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తో ఇరువర్గాల అభిమానులు పోటీ నెలకొనడం విశేషం. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు అయితే కొన్ని థియేటర్స్ లోనే టికెట్లు అన్నిటిని కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాను డి.వి.వి.దానయ్య 450 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే 800 కోట్లకు పైగానే జరిగినట్లుగా తెలుస్తోంది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే వందకోట్ల కలెక్షన్స్ అందుకుంటుందని కూడా చెబుతున్నారు. గత సంక్రాంతికి విడుదల చేయాలని ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవలసి వచ్చింది. అంతేకాకుండా అప్పుడే ప్రమోషన్స్ కోసం దాదాపు 30 కోట్ల వరకు ఖర్చు చేయడం జరిగింది ఇక ఇప్పుడు మరో సారి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అలాగే ఇంటర్వ్యూల తో సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యే విధంగా ప్రమోషన్స్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక రామ్ చరణ్ తేజ్ మొన్నటివరకు ఉపాసనతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. వీరు ఇద్దరు కూడా దాదాపు రెండేళ్ల తర్వాత చాలా హ్యాపీగా వెకేషన్ ను ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X