ఫిట్‌నెస్ విషయంలో మోసపోయిన రామ్ చరణ్.. RRR కోసం మళ్ళీ కష్టపడాల్సిందే!
ఫిట్నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు ఊహించని లుక్ లోకి మారిపోవడం కాయం. అందుకే స్టార్ సెలబ్రెటీస్ ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల రామ్ చరణ్ వేరే పనులపై పడి ఫిట్నెస్ విషయంలో తెలియకుండా మోసపోయినట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో ఎలాగూ షూటింగ్స్ ఉండవని అనుకున్నాడో ఏమో గాని మెగా పవర్ స్టార్ ఒక పొరపాటు వల్ల ఇప్పుడు ఎక్కువగా కష్టపడే పరిస్థితి ఎదురైంది.

గ్యాప్ రావడంతో..
రాజమౌళి RRR సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్న విషయం తెలిసిందే. విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కి కూడా అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ దక్కింది. అందులో మంచి ఫిట్నెస్ తో అన్ని వర్గాల వారిని ఆకర్షించిన రామ్ చరణ్ షూటింగ్ కి గ్యాప్ రావడం వలన మరొక లుక్ లోకి మారిపోయాడట.

అందుకే ఫిట్నెస్ లో మార్పులు..
కరోనా కారణంగా షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఖాళీ సమయం దొరకడంతో పూర్తిగా స్వామి మాల వేసుకొని డేవోషనల్ లైఫ్ లోకి షిఫ్ట్ అయ్యాడు చరణ్. ఇక నిత్యం పూజలతో దైవ ఆరాధనలో ఉంటూ డైట్ ని పెద్దగా పట్టించుకోలేదట. అలాగే కొన్నిరోజుల పాటు వర్కౌట్స్ కి కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఫిట్నెస్ లో మార్పులు వచ్చయట.

రాజమౌళి చెప్పకముందే..
లుక్స్ కాస్త డిఫరెంట్ గా అనిపించడంతో రాజమౌళి చెప్పకముందే వర్కౌట్స్ మొదలెట్టాడు. మళ్ళీ పాత రోజుల్లో లాగా వీలైనంత ఎక్కువగా కష్టపడాలని డిసైడ్ అయ్యాడట. వర్కౌట్స్ కి సంబంధించిన ఫొటోలను కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన చరణ్ మైండ్ జిమ్ చేయమని చెబుతోంది అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

మళ్ళీ షూటింగ్ ఎప్పుడో..?
ఇక RRR షూటింగ్ ని స్టార్ట్ చేయడానికి దర్శకుడు రాజమౌళి చాలానే కష్టపడుతున్నాడు. కరోనా వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మరికొన్ని రోజుల్లో స్పెషల్ సెట్స్ లలో షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉందట. అందుకే రామ్ చరణ్ కూడా వర్కౌట్స్ మొదలుపెట్టినట్లు అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications











