తెలుగు హీరోలకు చుక్కలు చూపిస్తున్న తమిళ దర్శకులు..టెన్షన్‌లో రామ్ చరణ్

ఒకప్పుడు తమిళ దర్శకులకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉండేది. తెలుగు హీరోలందరు కూడా తమిళ దర్శకులతో సినిమాలు చేయాలని ఆశపడుతుండేవారు. ఎస్.జె.సూర్య, మణిరత్నం, శంకర్, ఎ ఆర్ మురుగదాస్,లింగుసామీ, గౌతమ్ మీనన్ వంటి దర్శకులతో సినిమాలు చేయాలని తెలుగు హీరోలు కలలు కనేవారు. కట్ చేస్తే..తమిళ దర్శకులు అంటేనే తెలుగు హీరోలు బయపడేస్థాయికి పరిస్థితి వచ్చింది.

తమిళ దర్శకులతో తీసిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అవుతున్నాయి. పవన్ కల్యాణ్ , మహేష్ బాబుల నుంచి నాగచైతన్య వరకు కూడా తమిళ దర్శకులతో సినిమాలు చేసి చేతులు కాల్చుకున్నారు. తమిళ దర్శకుల బారిన పడిన తెలుగు హీరోల లిస్ట్ ఓసారి చూద్దాం..

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

పవన్ కల్యాణ్ , మహేష్ బాబులకు డిజాస్టార్ ఇచ్చిన ఎస్.జె.సూర్య: దర్శకుడు ఎస్.జె.సూర్యకు తమిళంలో మంచి క్రేజ్ ఉంది. ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ కూడా అప్పట్లో హిట్‌గా నిలవడంతో..ఎస్.జె.సూర్యకు పిలిచి మరి అవకాశం ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. వీరిద్దరి కాంబినేషన్‌లో 2001లో వచ్చిన ఖుషి ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

అయితే తరువాత వీరిద్దరి కాంబినేషన్‌లో భారీ అంచనాల మధ్య వచ్చిన కొమరం పులి సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్‌గా నిలిచింది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుకు సైతం ఎస్.జె.సూర్య డిజాస్టార్ ఇచ్చారు. వీరి కాంబినేషన్‌లో వచ్చిన నాని సినిమా దారుణంగా ఫ్లాప్ అయింది. మహేష్ బాబు కెరీర్‌లోనే నాని సినిమా మాయని మచ్చలా నిలిచిపోయింది.

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

రామ్‌కు షాకిచ్చిన లింగుసామీ: లింగుసామీ సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. గతంలో మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలు లింగుసామీ దర్శకత్వంలో పని చేయాలని చూశారు. కాని ఆ సినిమాలు పట్టాలెక్కలేదు. కాని యంగ్ హీరో రామ్‌తో కలిసి పని చేశారాయన.

లింగుసామీ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన సినిమా వారియర్‌. కృతిశెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. రామ్ కెరీర్‌లోనే వారియర్‌ అట్టర్ ప్లాప్‌గా నిలిచింది.

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

విజయ్ దేవరకొండకు సైతం తప్పని ప్లాప్: తమిళ దర్శకుల స్ట్రోక్ విజయ్ దేవరకొండకు సైతం తప్పలేదు. గీత గోవిందం , టాక్సీవాలా వంటి వరుస హిట్లతో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ నోటా సినిమా షాకిచ్చింది. 2018లో వచ్చిన ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ పిర్జాదా, నాజర్ తదితరులు నటించారు. విజయ్ దేవరకొండ వరుస హిట్లకు నోటా సినిమా బ్రేక్ వేసిందనే చెప్పాలి.

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

మహేష్ బాబుకు భారీ ప్లాప్‌ ఇచ్చిన మురుగదాస్: ఒకప్పుడు వరుస హిట్లతో సూపర్ క్రేజ్ ఉన్న ఎ ఆర్ మురుగదాస్ సైతం మహేష్ బాబుకు ఓ ప్లాప్‌ను ఇచ్చారు. వీరిద్దరి కాంబినేషన్‌లో 2017లో వచ్చిన స్పైడర్ సినిమా దారుణ ఫలితాన్ని చవి చూసింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. ఎస్.జె.సూర్య విలన్‌గా నటించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌‌గా నటించింది.

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

నాగచైతన్యకు బిగ్ షాకిచ్చిన కస్టడీ: వరుస ప్లాప్‌లతో సతమతం అవుతున్న అక్కినేని ఫ్యామిలీకి కస్టడీ మూవీ మరో షాకిచ్చింది. దర్శకుడు వెంకట్ ప్రభు మీద నమ్మకంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకట్ ప్రభు సినిమాల్లోని స్క్రీన్ ప్లే ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఇదే కస్టడీపై అంచనాలు పెంచేలా చేసింది. కాని కస్టడీలో మ్యాటర్ లేదని ప్రేక్షకులు తేల్చేశారు. ఈ మూవీతో నాగ చైతన్య మరో ప్లాప్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లుయింది.

Ram Charan in Tension after Tamil Directors Flops To Telugu Heroes like Mahesh Babu, Naga Chaitanya, Vijay Deverakonda

టెన్షన్‌లో రామ్ చరణ్: ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా తమిళ దర్శకుడైనా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్యాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్‌కు మంచి స్పందన లభించింది. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయడానికి చిత్ర నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.

ఇలా అరవ దర్శకులందరు కూడా తెలుగు హీరోలకు ప్లాప్‌లను ఇస్తుండంటంతో.. మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తమ హీరోకు ఎక్కడ ప్లాప్ వస్తుందో అని ఫ్యాన్స్ తెగ భయపడిపోతున్నారు. మరి దర్శకుడు శంకర్ అయిన రామ్ చరణ్‌కు హిట్ ఇచ్చి ఈ అనవాయితీకి బ్రేక్ వేస్తారేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X