Game Changer: రామ్ చరణ్ ఇంట్రో సీన్ లీక్.. హెలీకాప్టర్‌లో అలా చేసిన ఏకైక హీరో
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది పాన్ ఇండియా రేంజ్ స్టార్లు ఉన్నారు. అలాంటి వారిలో కొందరికి మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒకడు. ఈ మధ్య కాలంలో వరుస హిట్లతో సత్తా చాటడడంతో పాటు గ్లోబల్ స్టార్ అనిపించుకున్న అతడు.. ఫుల్ జోష్‌తో ముందుకు సాగుతున్నాడు.
యమా ఫామ్‌లో ఉన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్‌తో 'గేమ్ చేంజర్' అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన షూటింగ్ ఎప్పుడో మొదలైనా మధ్యలో కొన్ని అనుకోని బ్రేకులు వచ్చాయి. ఇలా ఇన్ని రోజుల వ్యవధిలో కేవలం 70 శాతం వరకూ మాత్రమే టాకీ పార్టును కంప్లీట్ చేసుకున్నారు.

సెన్సేషనల్ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'గేమ్ చేంజర్' మూవీ షూటింగ్‌ను ఇటీవలే పున: ప్రారంభించారు. దీన్ని హైదరాబాద్‌లో జరుపుతున్నారు. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్‌లో హీరో రామ్ చరణ్ కూడా పాల్గొంటున్న విషయం తెలిసిందే.
పొలిటికల్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోన్న 'గేమ్ చేంజర్' మూవీ నుంచి ఇప్పటికే ఎన్నో అంశాలు బయటకు వచ్చేశాయి. ముఖ్యంగా ఇందులో రామ్ చరణ్ చీఫ్ ఎలెక్షన్ ఆఫీసర్‌గా నటిస్తున్నట్లు సమాచారం లీకైంది. అందుకు అనుగుణంగానే తాజాగా ఈ మూవీలో అతడి ఎంట్రీ సీన్ గురించి కీలక విషయం వెలుగులోకి వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. 'గేమ్ చేంజర్' మూవీలో రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ హెలీకాప్టర్‌లో ప్లాన్ చేశారట. ఓ ఏరియాను ఒక రౌడీ గుప్పెట్లోకి తీసుకుని ఎవరూ ఓట్లు వేయకుండా ఆపుతాడట. అక్కడికి రోడ్డు మార్గం బంద్ అవడంతో ఎలెక్షన్ ఆఫీసర్ అయిన రామ్ చరణ్ హెలీకాప్టర్‌లో వెళ్లి.. ఆ రౌడీతో పోరాటం చేస్తాడని తెలిసింది. ఇది గతంలో ఎవరూ చూపించని ఇంట్రో సీన్‌గా వచ్చిందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ నటిస్తోన్న 'గేమ్ చేంజర్' మూవీలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి థమన్ సంగీతం ఇస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాలో శ్రీకాంత్, జయరాం, అంజలి, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











