గడ్డకట్టే చలిలో చొక్కా లేకుండా... రామ్ చరణ్ నిజమైన హీరో!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన తాజాగా ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. 'వినయ విధేయ రామ' చిత్రంలో యాక్షన్ సీన్ చేయడానికి ముందు తన కండలు బాగా కనిపించేలా రామ్ చరణ్ సెట్స్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తున్నట్లు వీడియోలో ఉంది.

జనవరి 11న 'వినయ విధేయ రామ' సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ వీడియో సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. స్కీన్ మీద అభిమానులను అలరించడానికి రామ్ చరణ్ లాంటి స్టార్స్ తెర వెనక ఎంత కష్టపడతారో ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

నువ్వు నిజమైన హీరో అంటూ ఉపాసన

‘‘ఒక కష్టమైన యాక్షన్ సీన్ చేసే ముందు నా ర్యాంబో సెట్స్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియో ఇది. గడ్డకట్టే చలిలో చొక్కా లేకుండా ఇదంతా చేశాడు. మిస్టర్ సి(రామ్ చరణ్) నువ్వు నిజమైన హీరో' అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి

బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టెనర్ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బోర్డ్ సభ్యులు యూ/ఎ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సంక్రాంతికి మాస్‌ ప్రేక్షకులను అలరించే అన్ని ఎలిమెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించారు.

హైలెట్ అయ్యే అంశాలు

హైలెట్ అయ్యే అంశాలు

సెన్సార్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం .... ఇంటర్వెల్ బ్లాక్ అద్భుతంగా ఉంటుందని, ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్స్ అభిమానులను అలరిస్తాయని తెలుస్తోంది.

రిలీజ్ ముందే ఈ ప్రచారం ఏమిటో...

రిలీజ్ ముందే ఈ ప్రచారం ఏమిటో...

‘వినయ విధేయ రామ' ఇంకా విడుదల కాకముందే ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే అంశంపై ట్విట్టర్లో చర్చసాగుతోంది. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ ఉండోదని, కొత్త సీసాలో పాత సారా మాదిరిగా ఉంటుందని, ఆంధ్రాలో హిట్, తెలంగాణలో ఎబో యావరేజ్, ఓవర్సీస్‌లో బిలో యావరేజ్‌గా నడుస్తుందనే ప్రచారం జరుగుతుండటం అభిమానులను విస్మయానికి గురి చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X