ప్రభాస్ పెళ్లి విషయాన్ని లీక్ చేసిన రామ్ చరణ్.. అమ్మాయి ఎవరో తెలుసా

Prabhas Marriage: ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే.. టక్కుమని గుర్తుకు వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే వెంటనే చెప్పొచ్చు. అలాగే కల్కి సినిమాలో సుమతిని భైరవ ఎందుకు వెంబడిస్తాడంటే కూడా ఒక క్లారిటీ ఇవ్వచ్చు. కానీ, ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం కష్టమే అయిపోయింది. ఎన్నో రోజులుగా రెబల్ స్టార్ ఫ్యాన్స్.. తమ హీరో పెళ్లి కోసం ఎదురుస్తున్నారు. ప్రభాస్, ప్రభాస్ ఫ్యామిలీ, అతని స్నేహితులు ఎవరైనా.. ఎక్కడైనా.. కనిపించిన ప్రభాస్ పెళ్లి గురించి ప్రశ్నలు ఎదురవుతాయి. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రశ్న ఎదురైంది. దీంతో ప్రభాస్ పెళ్లి విషయాన్ని లీక్ చేశారు. అమ్మాయి ఎవరో కూడా ఓ క్లారిటీ ఇచ్చేశారు.

రెబల్ స్టార్ ప్రభాస్ తన పెళ్లి గురించి కంటే.. తన కెరీర్ పైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. డార్లింగ్ ప్రభాస్ కామిట్మెంట్స్ చూస్తే.. దిమ్మ తిరిగి పోతుంది. ఆయన లైన్ అప్ చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. వరస సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు ప్రభాస్. సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన ప్రభాస్.. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి మూవీతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. 1000 కోట్ల పైగా కలెక్షన్ వసూలు చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పుడు రాజాసాబ్ అనే హర్రర్ అండ్ లవ్ స్టోరీ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.

Ram Charan leaks Prabhas marriage news with Balakrishna in Unstoppable show Here is Bride details

అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫౌజీ అనే మూవీలో నటించబోతున్నారు. ఆ తర్వాత సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కబోయే 'స్పిరిట్' మూవీలో నటించబోతున్నారట. ఇలా వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ప్రభాస్.. ఇటీవల మరో మూడు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చారు. కే.జి.ఎఫ్., కాంతారా వంటి భారీ హిట్లర్ అందించిన హింబలే ఫిలిమ్స్ తో బిగ్ డీల్ చేసుకున్నారు. ఒకే సారి మూడు సినిమాలకు ఓకే చెప్పారు. దీంతో డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేకుండా పోయాయి.

Ram Charan leaks Prabhas marriage news with Balakrishna in Unstoppable show Here is Bride details

ఇలా వరుస విజయాలతో దూసుకెళ్తున్న ప్రభాస్.. మరి బ్యాచిలర్ లైఫ్ కు ఎప్పుడు ఎండ్ కార్డు వేస్తాడో.. మ్యారేజ్ లైఫ్ లో ఇప్పుడు అడుగు పెడతాడోనని రెబల్ స్టార్ ఫ్యాన్స్ వేచి చూస్తున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి.. ప్రభాస్ నే కాకుండా.. అతని స్నేహితులను కూడా అడుగుతున్నారు. అలా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఆ అనుభవం ఎదురైంది. రామ్ చరణ్ తన గేమ్ చేంజెస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలకృష్ణ హోస్టింగ్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్నారు. ఈ సమయంలో బాలకృష్ణ ప్రభాస్ పెళ్లి గురించి ప్రస్తావన తీసుకురాగా.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ ప్రభాస్ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పినట్లు సమాచారం.

Ram Charan leaks Prabhas marriage news with Balakrishna in Unstoppable show Here is Bride details

బాలకృష్ణ తన షోలో ప్రభాస్ పెళ్లి గురించి రామ్ చరణ్ ప్రశ్నించగా.. 'అమ్మాయి ఎవరో కాదు .. ప్రభాస్ పెళ్లి పెళ్లి చేసుకోబోయేది. పదహారు అణాల తెలుగింటి అమ్మాయే.. వెస్ట్ గోదావరి జిల్లా, గణపవరం కు చెందిన అమ్మాయి' అని రాంచరణ్ చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ఇప్పటికైనా ఈ వార్త నిజం కావాలని ప్రభాస్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మరి ప్రభాస్ తన ఫ్యాన్స్ కు తన పెళ్లి గురించి చెప్పి శుభవార్త చెబుతాడో.. లేదా సైలెంట్ గా ఉండి నిరాశ పరుస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Read more about: ram charan prabhas balakrishna
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X