Waltair Veerayya: రామ్ చరణ్ సంచలన వ్యాఖ్యలు.. స్టేజ్ పైనే మాస్ వార్నింగ్.. ఆ హీరోయిన్‌కేనంటూ!

దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ.. అరవై ఏళ్ల వయసులోనూ ఎంతో దూకుడుగా వ్యవహరిస్తూ సత్తా చాటుతోన్నాడు మెగాస్టార్ చిరంజీవి. కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత జెట్ స్పీడుతో దూసుకపోతోన్న ఆయన.. ఇప్పుడు మాస్ మహారాజా రవితేజతో కలిసి 'వాల్తేరు వీరయ్య' అనే మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ చిత్రం భారీ కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఇందులో పాల్గొన్న రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలేం జరిగిందో మీరే చూసేయండి!

 వాల్తేరు వీరయ్య దండయాత్ర

వాల్తేరు వీరయ్య దండయాత్ర

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమానే 'వాల్తేరు వీరయ్య'. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను చేస్తోన్న ఈ మూవీని టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించాడు. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచలి రవి శంకర్ నిర్మించారు. దీనికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇందులో శృతి హాసన్, కేథరిన్ థ్రెస్సా హీరోయిన్లుగా నటించారు.

 భారీ సక్సెస్.. 220 కోట్లకు పైగా

భారీ సక్సెస్.. 220 కోట్లకు పైగా

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఏమాత్రం సంబంధం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఈ మూవీకి కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. ఫలితంగా ఈ మూవీ రూ. 220 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టింది. తద్వారా భారీ సక్సెస్‌ను సాధించింది.

వీరయ్య విజయ విహారం అని

వీరయ్య విజయ విహారం అని

చిరంజీవి, రవితేజ కలయికలో బాబీ రూపొందిన 'వాల్తేరు వీరయ్య' మూవీ భారీ కలెక్షన్లను సాధిస్తుండడంతో చిత్ర యూనిట్ శనివారం రాత్రి హన్మకొండలో 'వీరయ్య విజయ విహారం' పేరిట ఓ సక్సెస్‌ను మీట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు చిరంజీవి, రామ్ చరణ్‌తో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, రాజకీయ నాయకులు కూడా హాజరై తెగ సందడి చేసేశారు.

వాళ్లకు ధన్యవాదాలు అంటూ

వాళ్లకు ధన్యవాదాలు అంటూ

'వీరయ్య విజయ విహారం' ఈవెంట్‌కు స్పెషల్ గెస్టుగా వచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'సినిమా పెద్ద హిట్ చేసినందుకు ప్రేక్షక దేవుళ్లు అందరికీ ధన్యవాదాలు. అలాగే, మా లాంటి అభిమానులు కోరుకునే విధంగా ఇందులో వింటేజ్ చిరంజీవిని చూపించినందుకు డైరెక్టర్ బాబీకి స్పెషల్ థ్యాంక్స్. అలాగే, రవితేజ ఈ సినిమాను చేసినందుకు థ్యాంక్స్' అని చెప్పాడు.

రవితేజ డైలాగ్‌పై షాకింగ్‌గా

రవితేజ డైలాగ్‌పై షాకింగ్‌గా

వాల్తేరు వీరయ్య 'వీరయ్య విజయ విహారం' ఈవెంట్‌‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కంటిన్యూ చేస్తూ.. 'ఈ సినిమాలో ఓ సీన్ ఉంది. అందులో రవితేజ ''హలో ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో'' అంటాడు. అది తన తమ్ముడు అన్నాడు కాబట్టి ఆయన సైలెంట్‌గా ఉన్నారు. అదే వేరే ఎవరైనా అనుంటే ఎలా ఉండేదో తెలుసు కదా' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

రామ్ చరణ్ మాస్ వార్నింగ్


ఇదే వేడుకలో రామ్ చరణ్ కొనసాగిస్తూ.. 'చిరంజీవి గారు సైలెంట్‌గా ఉంటారు, సౌమ్యులుగా ఉంటారు అని అంతా అంటారు. ఆయన సైలెంట్‌గా ఉంటేనే ఇంతమంది వచ్చారు. అదే ఆయన కొద్దిగా తెగించి మాట్లాడితే ఎంత మంది వస్తారు. ఆయనని అనేవాళ్ళకి ఇది తెలీదు. ఆయన్ని ఏమన్నా అంటే మనమే అనాలి. ఆయన సైలెంట్‌గా ఉన్నా మేము ఉండము గుర్తు పెట్టుకోండి' అని వార్నింగ్ ఇచ్చాడు.

ఆ హీరోయిన్‌కే అని టాక్

ఆ హీరోయిన్‌కే అని టాక్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం అవుతోన్నాయి. దీనికి కారణం ఇటవలే ఒకప్పటి హీరోయిన్, మంత్రి రోజా చిరంజీవిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే రామ్ చరణ్ వార్నింగ్ ఇచ్చాడని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దీనిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X