Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే వర్కౌట్స్.. వీడియో వైరల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ RRR సినిమా సక్సెస్ తర్వాత మళ్ళీ వెంటనే మరో సినిమాతో సక్సెస్ అందుకోవాలి అని అనుకున్నప్పటికీ కూడా ఆచార్య సినిమాతో ఊహించిన విధంగా ఒక చేదు అనుభవం అయితే ఎదురయింది. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా డిజాస్టర్ అయినప్పటికీ కూడా అతని రేంజ్ కొంచెం కూడా తగ్గలేదు అని సోషల్ మీడియాలో క్రేజ్ చూస్తేనే అర్థమవుతుంది.
ఇక రామ్ చరణ్ తేజ్ తన తదుపరి సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. అయితే ఎక్కడ గ్యాప్ దొరికినా కూడా రామ్ చరణ్ తేజ్ ఫిట్నెస్ విషయంలో అయితే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల రామ్ చరణ్ తేజ్ టాన్జానియాలో చేసిన ఒక వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన భార్య ఉపాసనతో కలిసి రాంచరణ్ తేజ్ టాన్జానియా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ నేచర్ ను ఎంజాయ్ చేసిన రామ్ చరణ్ ఇక అక్కడ కృత్రిమంగా చేసినటువంటి జిమ్ లో కూడా వర్కౌట్ చేశాడు. రాళ్లతో తయారు చేసినటువంటి వాటితో చరణ్ చేసిన వర్కౌట్స్ మామూలుగా లేవు. ఇక తదుపరి సినిమా RC 15 షెడ్యూల్ కోసం రెడీ అవుతున్నట్లుగా రామ్ చరణ్ తేజ్ వివరణ అయితే ఇచ్చాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సాంగ్ న్యూజిలాండ్లో చిత్రీకరించబోతున్నారు. అందుకోసం దాదాపు 15 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తిచేసి రామ్ చరణ్ తేజ్ మరొక సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకురావాలని అనుకుంటున్నాడు. ఇదివరకే గౌతమ్ తిన్ననూరితో ఒక సినిమా చేయాలని అనుకున్నప్పటికీ అది వర్కౌట్ కాలేదు. ఇప్పుడు మరొక దర్శకుడు కోసం అతను ఎదురుచూస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











