ఆ నిర్మాతతో కలిసి మరో బిగ్ బ్యానర్ స్తాపించబోతున్న రామ్ చరణ్.. మొదటి సినిమా ఆ హీరోతోనే..
ఇటీవల కాలంలో స్టార్ హీరోలు కూడా సొంతంగా ప్రొడక్షన్ హౌస్ లను స్థాపిస్తున్న విషయం తెలిసిందే. కేవలం సినిమాల పారితోషికం ద్వారా మాత్రమే కాకుండా సొంతంగా సినిమాలను నిర్మిస్తూ మంచి ఆదాయాన్ని అందుకుంటున్నారు. అయితే ఇప్పటికే మెగా హీరోలలో అతిపెద్ద సినిమాలను నిర్మించిన హీరోగా రామ్ చరణ్ గుర్తింపు అందుకున్నాడు.
అయితే ఇప్పుడు అతను సరికొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు మరొక నిర్మాత తో చేతులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. వారి కలయికలో ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ రాబోతున్నట్లు సమాచారం. ఇక ప్రొడక్షన్ హౌస్ లో ఒక యువ హీరో కూడా మొదటగా నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

తండ్రి స్థాయి పెరిగే విధంగా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఒకవైపు బిజీ బిజీగా ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూనే మరొకవైపు డిఫరెంట్ కదలను ప్రొడ్యూస్ చేయాలని ఆసక్తి చూపిస్తున్నాడు. ఇప్పటికే తన తండ్రిని హీరోగా మరో లెవల్ కు వెళ్లే విధంగా కొణిదెల ప్రొడక్షన్ లో సినిమాలను నిర్మించాడు.
ఖైదీ నెంబర్ 150 సైరా సినిమాలను భారీ బడ్జెట్ తో నిర్మించిన రామ్ చరణ్ తేజ్ మరికొన్ని నిర్మాణ సంస్థలతో కూడా చేతులు కలిపి సంయుక్తంగా సినిమాలను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆచార్యను అదే విధంగా నిర్మించిన విషయం తెలిసిందే.

తన దగ్గరి మిత్రుడితోనే: అయితే రామ్ చరణ్ తేజ్ ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న సరికొత్త టాలెంట్ ను సపోర్ట్ చేసే విధంగా ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్ ను నిర్మించాలని గత కొంతకాలంగా చర్చలు అయితే జరుపుతున్నాడట. ఇక మొత్తానికి ఇప్పుడు ఆ ప్రణాళికకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. తనకు ఎంతో దగ్గర మిత్రుడు అయిన వారితోనే ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ లాంచ్ చేస్తున్నట్లు సమాచారం.

V మెగా పిక్చర్స్: ఇక ఆ మిత్రుడు మరెవరో కాదు ప్రభాస్ స్నేహితులు స్థాపించిన UV క్రియేషన్స్ లో ఒక భాగస్వామిగా ఉన్న విక్రమ్ అనే నిర్మాత అని తెలుస్తోంది. అతను ఇప్పుడు రామ్ చరణ్ తో చేతులు కలపబోతున్నట్లుగా తెలుస్తోంది. వీరి కలయికలో 'V మెగా పిక్చర్స్' అనే బ్యానర్ను స్థాపించనున్నారట. ఇందులో డిఫరెంట్ కదలను ఎక్కువగా తెరపైకి తీసుకురావాలి అనే ఆలోచనతో స్థాపించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా వెబ్ కంటెంట్ కూడా నిర్మించాలని అనుకుంటున్నారట.

మొదటి సినిమా ఆ హీరోతోనే: ఇక లేటెస్ట్ గా అందుతున్న మరొక టాక్ ప్రకారమైతే ఇందులో మొదటగా నటించే హీరో అక్కినేని అఖిల్ అని తెలుస్తోంది. అఖిల్ కు ఒక మంచి సక్సెస్ ఇవ్వాలి అని రామ్ చరణ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు.
ఇక యువీ క్రియేషన్స్ తో కూడా అఖిల్ ఒక సినిమా చేసేందుకు ఇదివరకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ వి మెగా పిక్చర్స్ లో అఖిల్ నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇంకా స్టోరీ మాత్రం ఫైనల్ కాలేదు. అఖిల్ కు ఎలాగైనా మంచి సక్సెస్ ఇవ్వాలి అనే రామ్ చరణ్ డిఫరెంట్ కదలను పై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











