RC 17కు అదిరిపోయే ప్లాన్.. ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉందంటే?
ఆర్ఆర్ఆర్ సినిమా, నాటు నాటు పాటతో గ్లోబల్ స్టార్ గా మారాడు రామ్ చరణ్. ఆ పాటకు ఆస్కార్ రావడంతో చెర్రీకి మరింతగా క్రేజ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో చరణ్ నెక్స్ట్ ప్రాజెక్టులపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అదే రేంజ్ లో సినిమాలను తీసుకు వచ్చేందుకు రామ్ చరణ్ తో పాటు దర్శకులు కూడా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఈయన ది గ్రేడ్ డైరెక్టర్ శంకర్ తో కిలిస గేమ్ ఛఏంజర్ అనే సినిమా చేశారు. అది ఇంకా విడుదల కూడా కాలేదు. కానీ చెర్రీ తర్వాతి సినిమాల గురించి పెద్ద ప్లానింగే జరుగుతోంది. ఇప్పటికే బుచ్చిబాబుతో ఈ సినిమా కన్ఫార్మ్ చేసుకున్న హీరో నెక్స్ట్ సినిమాను కూడా లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం.

గేమ్ ఛేంజర్ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించకముందే మరో సినిమాను లాక్ చేసుకున్నాడీ యంగ్ హీరో. ముఖ్యంగా తొలి సినిమా ఉప్పెనతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఫిక్స్ అయిపోయారు. ఈ చిత్రం రామ్ చరణ్ కు 16వది కావడంతో RC16 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఇది స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్నట్లు.. ముఖ్యంగా లెజెండరీ రెజ్లర్ కోడి రామ్మూర్తి నాయుడి బయోపిక్ గా సమాచారం.
ఇదంతా ఇలా ఉండగా.. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాకముందే RC17 కన్ఫార్మ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. రంగస్థలం సినిమా తర్వాత వీరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే. అయితే గేమ్ ఛేంజర్ సినిమా విడుదల కూడా కాకముందు.. అందులోనూ బుచ్చిబాబుతో సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో కూడా తెలియక ముందే నెక్ట్స్ సినిమా గురించి ప్లాన్ అంటే కాస్త షాకింగ్ విషయం అనే చెప్పాలి.

వీరిద్దరి కాంబోలో RC17 ఫిక్స్ అయినా ఈ సినిమా రావాలంటే చాలానే సమయం పడుతుంది. ముఖ్యంగా రెండేళ్ల తర్వాత అంే 2026లో ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది. షూటింగ్ కూడా అదే ఏడాది ప్రారంభం అవుతుండొచ్చు. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.


Click it and Unblock the Notifications











