అమ్మాయి కోసం రామ్ చరణ్ రిస్క్: సురేందర్ రెడ్డితో కలిసి
'చిరుత' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న అతడు.. రెండో మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. దీంతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకోవడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. ఇన్నేళ్ల కెరీర్‌లో ఎన్నో హిట్లను అందుకుని టాలీవుడ్‌లోని టాప్ హీరోల్లో ఒకడిగా వెలుగొందుతున్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా న్యూస్.? పూర్తి వివరాల్లోకి వెళితే....

రామ్ చరణ్ గ్యాప్ ఇవ్వలేదు.. ఇవ్వాల్సి వచ్చింది
కెరీర్‌లో ఎక్కువ శాతం సక్సెస్ రేటు ఉన్న హీరోల్లో రామ్ చరణ్ ఒకడు. అందుకే అతడు వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే, ‘వినయ విధేయ రామ' తర్వాత అతడు నటించిన మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం నటించే సినిమా ఈ సంవత్సరం రిలీజ్ కావడం లేదు. అంటే రెండేళ్లు అతడి సినిమా ఉండదు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

భారీ మల్టీస్టారర్‌లో.. నందమూరి హీరోతో కలిశాడు
ప్రస్తుతం రామ్ చరణ్... దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న RRR (రౌద్రం రుధిరం రణం)లో జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కే ఈ సినిమాలో చెర్రీ.. అల్లూరిగా, తారక్.. కొమరం భీంగా నటిస్తున్నారు. వీళ్లిద్దరితో పాటు పలు ఇండస్ట్రీలకు చెందిన నటులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

తండ్రి సినిమాలో చరణ్.. 30 నిమిషాలు అదుర్స్
RRRలో నటిస్తూనే తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘ఆచార్య'లోనూ కీలక పాత్ర పోషించడానికి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీలో అతడి పాత్ర దాదాపు 30 నిమిషాల పాటు ఉంటుందని తెలుస్తోంది. నక్సలైట్ అయిన చెర్రీ.. ఓ మిషన్‌లో భాగంగా ప్రాణాలు కోల్పోతాడని ప్రచారం జరుగుతోంది.

రామ్ చరణ్ తర్వాతి సినిమా ఏ దర్శకుడితో.?
రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RRR వచ్చే ఏడాది విడుదల కానుంది. దీంతో ఈ లోపు మరో సినిమాను అతడు కంప్లీట్ చేయాలనుకుంటున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది దర్శకులు చెప్పిన కథలను విన్నాడని అంటున్నారు. అయితే, పలానా దర్శకుడితో సినిమా ఉంటుందని ప్రచారం జరిగినా.. క్లారిటీ మాత్రం రావడం లేదు.

అతడే ఖాయం.. చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్
అనిల్ రావిపూడి, సందీప్ రెడ్డి వంగా, సుజిత్ ఇలా ఎంతో మంది దర్శకులు రామ్ చరణ్‌తో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, అతడు మాత్రం తనకు ‘ధృవ' వంటి సూపర్ హిట్‌ను ఇచ్చిన సురేందర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరొందిన అతడు.. చిరంజీవితో ‘సైరా: నరసింహారెడ్డి' అనే చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే.
Recommended Video

ఆ అమ్మాయి కోసం రామ్ చరణ్ భారీ రిస్క్
సురేందర్ రెడ్డి - రామ్ చరణ్ కాంబోలో సినిమా ఉంటుందని అధికారిక ప్రకటన వెలువడక ముందే.. దానికి సంబంధించిన స్టోరీ లైన్ లీకైంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో చరణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఓ గొప్పింటి అమ్మాయి కిడ్నాప్ కేసును ఛేదించేందుకు అతడు చేసిన సాహసాలే ఈ సినిమా కథ అని ఇండస్ట్రీలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











