RRR కోసం నిద్ర లేకుండా కష్టపడుతున్న రామ్ చరణ్
టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇండియా వైడ్ గా బిగ్గెస్గ్ పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న చిత్రం RRR. ఈ సినిమా ఆడియెన్స్ ఏ రేంజ్ లో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అయితే సినిమాపై అంచనాలు రోజురోజుకు అమితంగా పెరుగుతున్నాయి. ఇక అందరి చూపు ఇప్పుడు రామ్ చరణ్ బర్త్ డే వైపే ఉంది.
ఆ రోజు రాజమౌళి ఇచ్చే సర్ ప్రైజ్ ఎలా ఉండబోతోందా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న రామ్ చరణ్ 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు. ఇక ఆచార్యతో పాటు RRR అప్డేట్ పై కూడా ఆడియెన్స్ భారీగా ఆశాలైతే పెట్టుకున్నారు. అయితే మొన్నటి వరకు ఆచార్యతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఇప్పుడు టోటల్ గా రాజమౌళితో కనెక్ట్ అయ్యాడు.

సినిమా కోసం రాజమౌళి ఏది చెబితే అది చెయ్యడానికి డిసైడ్ అయిన రామ్ చరణ్ RRR షూటింగ్ కోసం అర్ధ రాత్రులు కూడా కష్టపడుతున్నాడట. కొన్ని కీలకమైన సన్నివేశాలను అర్ధరాత్రి తీస్తేనే బావుంటుందని చిత్ర యూనిట్ మొత్తం నిద్ర లేకుండా కష్టపడుతున్నారు. ఇక రామ్ చరణ్ కూడా రాత్రి 8గంటల నుంచి ఉదయం 4గంటల వరకు షూటింగ్ లో ఉంటున్నట్లు సమాచారం. ఇక సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











