భార్యకు సేవలందిస్తున్న రామ్ చరణ్.. పెళ్లి కానీ హీరోలకు అదే ఛాలెంజ్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ఎంపికలోనే కాదు జీవితంలో వేసే ప్రతి అడుగులో తన పాజిటివ్ ఆలోచనల్ని చూపిస్తున్నాడు. కూల్ గా ఉంటూ బాబాయ్ పవన్ కళ్యాణ్ మాదిరిగా అప్పుడప్పుడు మంచి పనులు కూడా చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన భార్యతో హ్యాపీగా గడుపుతున్న రామ్ చరణ్ పెళ్లి కానీ హీరోలకు ఒక ఛాలెంజ్ విసిరాడు.
దర్శకుడు రాజమౌళి #betherealman అనే ఛాలెంజ్ ని పూర్తి చేసి హీరో రామ్ చరణ్ ని నామినేట్ చేసిన విషయం తెలిసిందే. అయితే రామ్ చరణ్ కూడా దర్శకుడు చెప్పిన పనిని సక్రమంగా చేసి అందరికంటే ఒక పని ఎక్కువగానే చేశాడు. ఇంటికి పనులతో పాటు తన భార్య ఉపాసనకు కూడా సేవలు అందిస్తున్నట్లు వీడియోలో చూపించాడు. ఉపాసన హుందాగా కూర్చొని ఉండగా రామ్ చరణ్ కూల్ గా హాట్ కాఫీ కలిపి ఇచ్చాడు.

ప్రస్తుతం ఆ ఛాలెంజ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఛాలెంజ్ లో రామ్ చరణ్ తన నుంచి మరికొంతమందిని నామినేట్ చేశాడు. అందులో డైరెక్టర్ త్రివిక్రమ్, బాలీవుడ్ హీరో రన్ వీర్ తో పాటు పెళ్లి కాని తెలుగు హీరోలు రానా దగ్గుబాటి, శర్వానంద్ కూడా ఉన్నారు. మరి వీళ్ళు ఎలాంటి పనులు చేసి జనాలని ఆకట్టుకుంటారో చూడాలి.


Click it and Unblock the Notifications











