రామ్ చరణ్ సంచలన నిర్ణయం: RRR రిలీజ్ అయ్యే వరకు కనిపించకుండా ప్లాన్!

By Manoj

'చిరుత' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్. మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న అతడు... రెండో మూవీతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. అప్పటి నుంచి మంచి సక్సెస్‌ రేటుతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ టాలీవుడ్ భారీ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నాడు. దీనితో పాటే అతడు తన తండ్రి చిరంజీవి చిత్రంలోనూ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మెగా పవర్ స్టార్ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడని ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం.!

చరణ్ డేరింగ్ స్టెప్.. రియల్ హీరో‌గా సెట్

చరణ్ డేరింగ్ స్టెప్.. రియల్ హీరో‌గా సెట్

మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం RRR (రౌద్రం రుధిరం రణం) అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో అతడు స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పాత్రను పోషిస్తున్నాడు. ఇక ఇదే మూవీలో జూనియర్ ఎన్టీఆర్.. కొమరం భీం రోల్ చేస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణంలో రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఐదు భాషల్లో రూపొందిస్తున్నారు.

చిరంజీవికి గురువుగా రామ్ చరణ్ ఫిక్స్

చిరంజీవికి గురువుగా రామ్ చరణ్ ఫిక్స్

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న RRR షూటింగ్ పూర్తి కాకముందే రామ్ చరణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదే... తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆచార్య'. ఇందులో చెర్రీ నక్సలైట్‌గా కనిపించబోతున్నాడని అంటున్నారు. దాదాపు ముప్పై నిమిషాల పాటు కనిపించే ఈ పాత్ర చిరుకు ఎన్నో పాఠాలు చెబుతుందని సమాచారం.

ఏడాదిన్నరైనా ఇంకా ప్రకటించని చరణ్

ఏడాదిన్నరైనా ఇంకా ప్రకటించని చరణ్

భారీ బడ్జెట్... హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో పాటు టాప్ యాక్టర్లు నటిస్తున్న చిత్రం RRR. ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభమై దగ్గర దగ్గర రెండేళ్లు కావొస్తుంది. అయినప్పటికీ.. రామ్ చరణ్ మాత్రం తన తదుపరి సినిమాను ప్రకటించలేదు. మరోవైపు ఎన్టీఆర్ మాత్రం త్రివిక్రమ్‌తో మూవీని అనౌన్స్ చేశాడు. ప్రశాంత్ నీల్‌తో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.

మెగా పవర్ స్టార్.. రెండేళ్ల పాటు కష్టమే

మెగా పవర్ స్టార్.. రెండేళ్ల పాటు కష్టమే

రామ్ చరణ్ నటించిన చివరిగా మాస్ డైరెక్టర్ బోయపాటి తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ'లో నటించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఇక, ఈ మూవీ విడుదలై దాదాపు ఏడాదిన్నర పైగానే అవుతోంది. ఇక, RRR వచ్చే సరికి మరో ఏడాది పట్టొచ్చు. అంటే దాదాపు రెండేళ్లకు పైగానే అతడి సినిమా వచ్చే ఛాన్స్ లేదు.

ఎంతో మంది దర్శకులు.. చరణ్ సైలెంట్

ఎంతో మంది దర్శకులు.. చరణ్ సైలెంట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించబోయే తదుపరి సినిమా గురించి ఎన్నో వార్తలు ప్రచారం అవుతున్నాయి. అతడు పలానా దర్శకుడితో సినిమా చేయబోతున్నాడని ఎంతో మంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. అంతేకాదు... అతడు నటించే సినిమాకు సంబంధించిన కథ ఇదే అంటూ ఓ లైన్ కూడా లీకైంది. ఇన్ని జరుగుతున్నా చరణ్ మాత్రం సైలెంట్‌గానే ఉండిపోయాడు.

Recommended Video

Parannageevi Anta Na Istam Song Released
సినిమాపై రామ్ చరణ్ సంచలన నిర్ణయం

సినిమాపై రామ్ చరణ్ సంచలన నిర్ణయం

త్వరలోనే రామ్ చరణ్ తన తర్వాతి సినిమాను ప్రకటించబోతున్నాడని ప్రచారం జరుగుతోన్న నేపథ్యంలో... ఓ షాకింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో చక్కర్లు కొడుతోంది. దీని ప్రకారం... మెగా పవర్ స్టార్ RRR రిలీజ్ అయ్యే వరకు మరో సినిమాలో నటించకూడదని నిర్ణయించుకున్నాడట. అయితే, ‘ఆచార్య'లో మాత్రం చిన్న పాత్రను చేస్తాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X