ఎన్టీఆర్, రాంచరణ్ కలసి మళ్ళీ!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి భారీ మల్టీస్టారర్ చిత్రంలో రాజమౌళి దర్శత్వంలో నటించబోతున్నారు. ఈ చిత్రం ప్రారంభం కాకముందే దేశవ్యాప్తంగా సినీప్రేమికులలో ఉత్కంఠ రేపుతోంది. నవంబర్ నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో ఎన్టీఆర్, రాంచరణ్ ఇద్దరూ రాజమౌళి చిత్రం కోసం ప్రత్యేకమైన వర్క షాప్ లో పాల్గొన్నారు. లాస్ ఏంజల్స్ లో ఈ వర్క్ షాప్ జరిగింది. తాజగా మరో మారు వర్క్ షాప్ జరగబోతున్నట్లు తెలుస్తోంది. సినిమా ప్రారంభానికి ముందే ఇలా ఉంటే.. రాజమౌళి ప్లానింగ్ ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఎన్టీఆర్ మొన్నటివరకు అరవింద సమేత చిత్రంతో బిజీగా గడిపాడు. అక్టోబర్ 11న ఈ చిత్రం విడుదలకు సిద్ధం అవుతోంది. ఇక రాంచరణ్ బోయపాటి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. నవంబర్ నాటికి ఈ చిత్ర షూటింగ్ కూడా ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉండడంతో ఈ హీరోలు ఇద్దరూ రాజమౌళి చిత్రంపై ఫోకస్ పెట్టనున్నారు.


Click it and Unblock the Notifications











