ఇంట్రెస్టింగ్: పవన్ తర్వాత ఆ పాత్రలో రామ్ చరణ్.. చిరు సినిమాలో మెగా పవర్ స్టార్ రోల్ ఇదే.!

By Manoj Kumar P

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తుతం తెలుగులో ఉన్న బడా హీరోల్లో ఒకడు. చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి ఎంటర్ అయినప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నాడు. తన రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి మిగిలిన హీరోలకు సవాల్ విసిరాడు. ఆ తర్వాత ఎన్నో కొత్త తరహా పాత్రలను చేసి మెప్పించాడు. ఈ క్రమంలోనే కొన్ని హిట్లను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా ఈ యంగ్ హీరో ఓ చాలెంజింగ్ రోల్‌ చేస్తున్నాడని వార్త ఒకటి లీక్ అయింది. అది కూడా తన తండ్రి చిరంజీవి నటిస్తున్న సినిమాలో కావడం విశేషం. వివరాల్లోకి వెళితే...

రెండు వైపులా నష్టపోయిన రామ్ చరణ్

రెండు వైపులా నష్టపోయిన రామ్ చరణ్

గత ఏడాది రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. దీంతో అతడికి నిరాశను మిగిల్చింది. ఇక, తన తండ్రి చిరంజీవి నటించిన ‘సైరా: నరసింహారెడ్డి' సినిమా వల్ల నిర్మాతగానూ నష్టాలను ఎదుర్కొన్నాడు చెర్రీ. దీంతో పోయిన ఏడాది మెగా ఫ్యామిలీకి కలిసి రాలేదు.

ఈ సారి రెండింతల బలంతో వస్తున్నారు

ఈ సారి రెండింతల బలంతో వస్తున్నారు

ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సైరా: నరసింహారెడ్డి' ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ ఈ సారైనా సత్తా చాటాలన్న లక్ష్యంతో రామ్ చరణ్ తన తండ్రితో మరో సినిమా చేస్తున్నాడు. టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించనున్న ఈ మూవీ ఇటీవలే షూటింగ్ ప్రారంభించుకుంది. హైదరాబాద్‌లో ప్లాన్ చేసిన మొదటి షెడ్యూల్‌లో పాటల చిత్రీకరణ జరుగుతోంది.

ముందుది కాదు.. కరెక్టుగా సెట్ చేశారు

ముందుది కాదు.. కరెక్టుగా సెట్ చేశారు

ఈ సినిమాకు ‘గోవింద ఆచార్య' అనే టైటిల్ పెడుతున్నట్లు చిత్ర యూనిట్ మొదట్లో పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. అయితే, ఆ తర్వాత కథలో జరిగిన మార్పుల వల్ల దీనికి ‘ఆచార్య' అనే టైటిల్ మాత్రమే ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవాదాయ భూములకు సంబంధించిన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కుతోందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే.

చిరు మూవీ.. చరణ్ ద్విపాత్రాభినయం

చిరు మూవీ.. చరణ్ ద్విపాత్రాభినయం

చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దానితో పాటు చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రను కూడా చేస్తున్నాడు. చిత్ర యూనిట్ దీనిని అధికారికంగా ప్రకటించకున్నప్పటికీ ఇది నిజమేనన్న టాక్ వినిపిస్తోంది. అంటే.. మొత్తంగా ఈ సినిమా కోసం చరణ్ నటుడిగా, నిర్మాతగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడన్న మాట.

చిరు సినిమాలో మెగా పవర్ స్టార్ రోల్ ఇదే.!

చిరు సినిమాలో మెగా పవర్ స్టార్ రోల్ ఇదే.!

ఈ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నాడన్న వార్త ప్రచారం అవుతున్నప్పటి నుంచి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. తాజాగా ఈ పాత్రకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ లీక్ అయింది. దీని ప్రకారం.. చిరు సినిమాలో రామ్ చరణ్ చేసేది మావోయిస్టు పాత్రట. కథను మలుపు తిప్పే ఈ పాత్రతో చిరంజీవికి కూడా సంబంధం ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.

Recommended Video

Megastar Chiranjeevi Sweet Warning To Ram Charan
పవన్ తర్వాత ఆ పాత్రలో రామ్ చరణ్

పవన్ తర్వాత ఆ పాత్రలో రామ్ చరణ్

స్టార్ హీరో మావోయిస్టుగా కనిపించిన సినిమాలు తక్కువే. అయితే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రం ‘జల్సా' అనే సినిమాలో ఆ పాత్ర చేశారు. తన గ్రామంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించేందుకు అడవుల్లోకి వెళ్లిన వ్యక్తిగా పవన్ కనిపిస్తాడు. ఇప్పుడదే పాత్రను చెర్రీ చేస్తున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘జల్సా' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X