బాడీ బిల్డింగ్ కోసం ఆ హీరో దగ్గరకు రామ్ చరణ్.. ఆ టార్చర్ భరించలేక..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan).. టాలీవుడ్‌లోకి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వారసుడిగా అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో. 'చిరుత'తో ప్రారంభమైన ఆయన ప్రయాణం... 'మగధీర', 'రంగస్థలం', 'RRR', 'గేమ్ ఛేంజర్' వరకు అంచెలంచెలుగా ఎదిగింది. రామ్ చరణ్ తన నటన, డ్యాన్స్, యాక్షన్ మాత్రమే కాదు... ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎప్పుడూ టాప్‌లో ఉంటారు. ఏ సినిమా అయినా.. క్యారెక్టర్‌కు తగ్గట్టుగా తన బాడీని మలచుకునే డెడికేషన్ ఆయనలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే, కెరీర్ ప్రారంభంలో రామ్ చరణ్ తొలుత ఫిట్‌నెస్ ట్రైనింగ్ కోసం ఓ టాలీవుడ్ హీరో దగ్గర వెళ్లారంట. అయితే, ఆ హీరో టార్చర్ భరించలేక 4 రోజులకే గుడ్ బై చెప్పారంట. ఇంతకీ ఆ టాలీవుడ్ హీరో ఎవరు? అసలేం జరిగిందంటే..?

ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్నారు. అందుకు కారణం ఆయన నిబ్దదత. కేవలం యాక్టింగ్, డ్యాన్స్, యాక్షన్ మాత్రమే కాదు.. ఫిట్‌నెస్ విషయంలో కూడా చాలా కఠినంగా ఉంటారు. రోజుకు కనీసం 1.5 గంటల వర్కౌట్, కఠినమైన డైట్, హెవీ వెయిట్ ట్రైనింగ్, కార్డియో, స్పోర్ట్స్ ఇవన్నీ ఆయన దైనందిన జీవితం భాగమే. 40 ఏళ్ల వయసులో కూడా ఆయన మెయింటైన్ చేస్తున్న మస్క్యులర్ ఫిజిక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. ఇందుకోసం ఇంటర్నేషనల్ ట్రైనర్స్‌తో ప్రత్యేక శిక్షణ తీసుకుంటూ, 80% హోమ్ ఫుడ్, హై ప్రోటీన్ డైట్‌ను ఫాలో అవుతున్నారు.

Ram Charan Quit Srihari s Tough Fitness Training in 4 Days Disco Shanti Reveals

అయితే ఈ ఫిట్‌నెస్ ప్రయాణం ప్రారంభం ఎలా జరిగిందో తెలిసినప్పుడు కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. రామ్ చరణ్ తన కెరీర్ ప్రారంభ దశలో 'మగధీర' కోసం మెగాస్టార్ చిరంజీవి గారు చరణ్‌ను శిక్షణ కోసం ఓ టాలీవుడ్ హీరో దగ్గరికి పంపించారట. ఆ ఆ ట్రైనర్ మరెవరో కాదు... టాలీవుడ్‌లో తన ఫిజిక్, డిసిప్లిన్‌తో ప్రసిద్ధి పొందిన నటుడు, రియల్ స్టార్ శ్రీహరి ( Srihari). ఈ విషయాన్ని శ్రీహరి సతీమణి డిస్కో శాంతి (Disco Shanti) ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

డిస్కో శాంతి చెప్పిన వివరాల ప్రకారం... చిరంజీవి స్వయంగా చరణ్‌ను శ్రీహరి దగ్గరకు పంపించారని తెలిపారు. "చరణ్‌ను నా బిడ్డలా చూసుకుంటాను" అంటూ శ్రీహరి బాధ్యత తీసుకుని ట్రైనింగ్ ఇచ్చారట. కానీ... ఆ ట్రైనింగ్ ఎంత కఠినంగా ఉండేదంటే.. ఉదయం 4:30కే శ్రీహరి లేచి పూజలు చేసి, 5 గంటలకల్లా రెడీ అయిపోయేవారు. 5:30కి వచ్చే చరణ్‌కు స్ట్రిక్ట్ రూటీన్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, ట్రెడ్‌మిల్, హిల్ వాక్ ఇలా ఎలాంటి బ్రేక్ లేకుండా కఠినంగా ట్రైనింగ్ ఇచ్చేవారు. ఇంత స్ట్రిక్ట్ డిసిప్లిన్‌కు మొదట చరణ్ కూడా అలవాటు పడలేకపోయాడట. దీంతో మొదటి కొన్ని రోజులు వచ్చి, ఆ తర్వాత మానేశాడు' అని డిస్కో శాంతి చెప్పింది. శ్రీ హరి ఫిట్ నెస్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరించేవాడు. అలానే .. రామ్ చరణ్ ను కూడా పిండేశారని సరదాగా చెప్పారు. అంటే... శ్రీహరి ఇచ్చిన ట్రైనింగ్ ఎంత టఫ్‌గా ఉందో అర్థం అవుతుంది. అయితే ఈ అనుభవం చరణ్‌కు ఫిట్‌నెస్‌పై మరింత అవగాహన తెచ్చిందని చెప్పొచ్చు.

ఇక 'మగధీర' సినిమాలో శ్రీహరి చేసిన మహేంద్ర బాహుబలి పాత్ర గురించి కూడా డిస్కో శాంతి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆ సమయంలో హీరోగా బిజీగా ఉన్న శ్రీహరి... మొదట ఈ పాత్రను చేయడానికి ఆసక్తి చూపలేదట. కానీ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి స్వయంగా ఇంటికి వెళ్లి కథ చెప్పి ఒప్పించారట. ఆ పాత్ర ప్రాముఖ్యత సినిమా రిలీజ్ తర్వాతే పూర్తిగా అర్థమైందని శాంతి తెలిపారు. నిజానికి... ఆ పాత్ర లేకపోతే 'మగధీర' కథనే అసంపూర్ణంగా ఉండేదని ఆమె అభిప్రాయపడ్డారు. షూటింగ్ సమయంలో శ్రీహరి ఆరోగ్యం బాగోలేకపోయినా... రాజమౌళి, ఆయన భార్య రమ కలిసి చాలా కేర్ తీసుకున్నారని కూడా ఆమె గుర్తుచేశారు. గుర్రంపై వచ్చే మహేంద్ర సీన్, షేర్ ఖాన్ పరిచయం, "మళ్లీ పుడతావురా భైరవ" డైలాగ్ వంటి సన్నివేశాలు ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

ఇలా , రామ్ చరణ్ ఫిట్‌నెస్ వెనుక ఉన్న కథ కేవలం జిమ్, డైట్ మాత్రమే కాదు... ప్రారంభంలో ఎదురైన కఠిన అనుభవాలు కూడా ఉన్నాయి. శ్రీహరి వంటి డిసిప్లిన్ ఉన్న నటుడి దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం కొద్ది రోజులు అయినా చరణ్ కెరీర్‌లో ఒక కీలక స్టేజ్‌గా చెప్పొచ్చు.ఇదే నిజం... ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా మెరిసే చరణ్ ఫిట్‌నెస్ వెనుక... ఇలాంటి స్ట్రిక్ట్ ట్రైనింగ్ ఉందని అనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీహరి భార్య డిస్కో శాంతి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Read more about: ram charan srihari disco shanti
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X