Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
రామ్ చరణ్ కోసం మరో గ్లామరస్ బ్యూటీ.. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో న్యూ ప్రాజెక్ట్!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా ప్రమోషన్స్ చేస్తూ మీడియా ఛానల్స్ కు కూడా రెగ్యులర్ గా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక రామ్ చరణ్ RRR సినిమా తర్వాత కూడా వరుసగా రెండు సినిమాలను లైన్ లో పెట్టాలి అని చూస్తున్నాడు. ఇప్పటికే దర్శకుడు శంకర్ తో తన 15 ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తప్పకుండా ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది అని రామ్ చరణ్ నమ్మకంతో ఉన్నాడు.
ఇక సినిమాలో కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ తో పాటు శ్రీకాంత్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇక రామ్ చరణ్ లేకపోయినప్పటికీ కూడా దర్శకుడు శంకర్ గ్యాప్ లేకుండా మిగతా సన్నివేశాలను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే రామ్ చరణ్ శంకర్ సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరి తో 16 సినిమా మొదలు పెట్టబోతున్నారు. జెర్సీ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గౌతమ్ తిన్ననూరి ప్రస్తుతం అదే సినిమాను బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా భారీ స్థాయిలో విడుదల చేయాలని సిద్ధమవుతున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ తో కూడా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. సినిమాలో హీరోయిన్ గా దిశా పటాని సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా గట్టిగానే ఉంటాయట. అయితే కిక్ బాక్సింగ్ మార్షల్ ఆర్ట్స్ లో ఇదివరకే కొన్ని సినిమాలు చేసే మంచి క్రేజ్ అందుకుని ఆమె గురించి తెలుసుకుని దర్శకుడు హీరో రామ్ చరణ్ కూడా చెప్పినట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే అఫీషియల్ గా క్లారిటీ ఇవ్వనున్నట్లు టాక్.
ఇక RRR ప్రమోషన్ లో రామ్ చరణ్ తారక్ తో పాటు రాజమౌళి కూడా పాటు అన్ని రకాల మీడియా సంస్థలతో ప్రమోషన్ చేయిస్తున్నాడు. ఏమాత్రం గ్యాప్ లేకుండా ఎక్కువగా టీవీ కంటెంట్ తోనే సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కపిల్ శర్మ షో లో పాల్గొన్న విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ షో లో కూడా సందడి చేశారు. దర్శకుడు రాజమౌళి ప్రమోషన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు అని తెలుస్తోంది. ఇక సినిమా జనవరి 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే.