రాంచరణ్, బోయపాటి సినిమా ఫస్ట్ లుక్ కబురు.. అజర్బైజాన్‌లో సందడి!
మెగా పవర్ స్టార్ రాంచరణ్, బోయపాటి కాంబినేషన్ లో భారీ యాక్షన్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంగస్థలం చితం తరువాత రాంచరణ్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రంలో మరో కీలక షెడ్యూల్ పూర్తి కానుంది. ప్రస్తుతం బోయపాటి ఈ చిత్రాన్ని అజార్బైజాన్ లో చిత్రీకరిస్తున్న సంగతి తెలిసిందే.
మరో రెండు రోజుల్లో ఈ షెడ్యూల్ పూర్తి కానుంది. ఆ తరువాత చిత్ర యూనిట్ హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఇంతవరకు ఈ చిత్ర టైటిల్ కూడా ప్రకటించలేదు. ఈ దసరాకు ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ చిత్రానికి స్టేట్ రౌడీ అనే మెగాస్టార్ టైటిల్ పరిశీలిస్తున్నారని ఫాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అజార్బైజాన్ లో షూటింగ్ లొకేషన్ లో ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. రాంచరణ్ కు జోడిగా కైరా అద్వానీ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Click it and Unblock the Notifications











