రాంచరణ్ అరుదైన రికార్డు.. RRRకు ముందే 10 లక్షల సైన్యంతో మెగా పవర్‌స్టార్

మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఎన్నో అరుదైన రికార్డులను బాక్సాఫీస్ వద్ద సొంతం చేసుకొన్నాడు. నటుడిగా, నిర్మాతగా తనదైన మార్కును చూపిస్తున్నాడు. ప్రస్తుతం రాంచరణ్ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. సోషల్ మీడియాలో అతి వేగంగా 10 లక్షల సైన్యాన్ని తన అకౌంట్‌లో చేర్చుకొన్నారు. ట్విట్టర్‌లో రికార్డు స్థాయిలో ఫాలోవర్స్ పెంచుకొన్నారు. ఆ విషయంలోకి వెళితే..

 మార్చి 27 పుట్టిన రోజున

మార్చి 27 పుట్టిన రోజున

రాంచరణ్ విషయానికి వస్తే 2020లో తన పుట్టిన రోజు మార్చి 27వ తేదీన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్‌లోకి ప్రవేశించాడు. అయితే ట్విట్టర్‌లోకి ప్రవేశించిన కొద్ది నెలల్లోనే ఓ అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ట్విట్టర్‌లో 10 లక్షల మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకొన్నారు. ఇప్పటి వరకు చెర్రీ కంటే అత్యంత వేగంగా ఒక మిలియన్ ఫాలోవర్స్‌ను సాధించిన వారు ఎవరూ లేరనే గమనార్హం.

233 రోజుల్లోనే రికార్డు స్థాయిలో

233 రోజుల్లోనే రికార్డు స్థాయిలో

రాంచరణ్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన 233 రోజుల్లోనే ఈ ఫీట్ సాధించి రామ్ చరణ్ మెగా పవర్ చూపించారు. దీంతో అభిమానులకు దీపావళి పండుగ ముందే తెచ్చినంత పనిచేశారు రాంచరణ్. ఇదిలా ఉండగా.. ట్విట్టర్‌లో ఆయన ఇద్దరినే ఫాలో అవుతున్నారు. అందులో ఒకరు మెగాస్టార్ చిరంజీవి కాగా, మరొకరు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కావడం విశేషం.

 RRR చిత్రంలో

RRR చిత్రంలో

ఇదిలా ఉండగా, సైరా నర్సింహారెడ్డి నిర్మాతగా సంచలన విజయం అందుకొన్న రాంచరణ్ ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR చిత్రంలో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ చిత్రం విడుదల వాయిదా పడింది. ఇటీవలే షూటింగు ప్రారంభించిన రాజమౌళి సంక్రాంతి కానుగానో.. లేదంటే వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

 యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి

యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి

RRR సినిమా రిలీజ్‌కు ముందే రాంచరణ్ మిలియన్ ఫాలోవర్స్ సాధించడం చూస్తే .. ఆ సంచలన చిత్రం రిలీజ్ తర్వాత దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ పెరిగి సోషల్ మీడియాలో మరింత దూసుకెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే రిలీజైన టీజర్లు, ఫస్ట్‌లుక్ అనూహ్యమైన స్పందన కనిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X