రామ్ చరణ్ అరుదైన రికార్డు: సౌత్‌లోనే ఫస్ట్ హీరోగా ఘనత.. ఇంతకీ ఏం సాధించాడంటే!
మెగాస్టార్ చిరంజీవి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తన టాలెంట్లను నిరూపించుకుని స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు రామ్ చరణ్. ఈ ఉత్సాహంతోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. దీనికితోడు RRR మూవీతో గ్లోబల్ స్టార్ అన్న పేరునూ తెచ్చుకున్నాడు. దీంతో మరింత జోష్‌తో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నాడు. ఇలా ఇప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
గేమ్ చేంజర్‌గా రామ్ చరణ్:లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' అనే సినిమా చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోంది. అలాగే, శ్రీకాంత్, అంజలి, జయరాం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ మ్యూజిక్‌ను ఇస్తున్నాడు.

బుచ్చిబాబుతో మరో మూవీ:'గేమ్ చేంజర్' సినిమా పూర్తి కాకముందే రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనతో చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లపై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే.
గ్లోబల్ స్టార్‌గా... ఫుల్లు క్రేజ్:కెరీర్‌ను మొదలెట్టినప్పటి నుంచి టాలీవుడ్‌కే పరిమితం అయిన రామ్ చరణ్.. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా స్టార్‌గా మారాడు. దీంతో అతడికి దేశ వ్యాప్తంగా క్రేజ్ పెరిగిపోయింది. అదే సమయంలో RRR మూవీతో గ్లోబల్ రేంజ్‌కు కూడా ఎదిగిపోయాడు. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్‌ను పెంచుకున్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాడు.

అందులో కూడా యాక్టివ్‌గా:రామ్ చరణ్ కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేస్తున్నాడు. అంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో అతడు ఎంతో యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకుంటున్నాడు. అలాగే, పర్సనల్ అండ్ ఫ్యామిలీ ఫొటోలను షేర్ చేస్తున్నాడు.
ఆ మైలురాయిని చేరాడు:సినిమాల్లో మాదిరిగానే రామ్ చరణ్‌కు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలోనే ఫాలోయింగ్ ఉంది. అన్ని ప్రాంతాలకు చెందిన అభిమానులు అతడిని ఫాలో అవుతుండడం వల్ల ఫాలోవర్ల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలోనే ఈ స్టార్ హీరో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 20 మిలియన్ ఫాలోవర్ల మార్కును చేరుకుని అరుదైన ఘనతను అందుకున్నాడు.

ఫాస్టెస్ట్ హీరోగా సెన్సేషన్:టాలీవుడ్‌లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న రామ్ చరణ్ సోషల్ మీడియాలోనూ సత్తా చాటుతున్నాడు. అందుకే ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకున్నాడు. తద్వారా సౌత్ ఇండియాలోనే ఈ మార్కును వేగంగా చేరుకున్న హీరోగా అతడు చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ రికార్డును అతడు బ్రేక్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











