నాన్నగారు అప్పుడే చెప్పారు.. అందుకే నా చుట్టూ 20 మంది, 15 ఏళ్లుగా : రామ్‌చరణ్ వ్యాఖ్యలు
మెగాస్టార్ చిరంజీవి నటవారసుడిగా మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో రామ్ చరణ్. తండ్రి అడుగుజాడల్లో కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ నేడు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు చెర్రీ. నటన , లుక్ విషయంలో వచ్చిన విమర్శలను సవాల్‌గా తీసుకుని యాక్టర్‌గా రాటుదేలారు. డ్యాన్స్‌ల విషయంలో చిరంజీవి వారసత్వాన్ని నిలబెట్టి అభిమానుల మన్ననలు పొందుతున్నారు చరణ్. చిరుత నుంచి ఆర్ఆర్ఆర్ వరకు విభిన్నమైన సినిమాలు చేసి గ్లోబల్ స్టార్‌గా వెలుగొందుతున్నారు.
రామ్ చరణ్ తొలుత సినిమాల పైన అంతగా ఆసక్తి ఉండేది కాదట.. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి కావడంతో క్రికెటర్ కావాలనుకున్నారు. ఇందుకు సంబంధించి కఠినమైన శిక్షణ కూడా తీసుకున్నారు. అలాగే జర్మనీలో ఆటోమొబైల్ ఇంజనీర్‌గా సెటిలవ్వాలని కూడా భావించారట. కానీ విధి ఆయనను సినీరంగం వైపు నడిపించిందని రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇప్పటికీ తీరిక వేళల్లో క్రికెట్ ఆడటం, చూడటం చేస్తుంటారాయన.

ఆర్ఆర్ఆర్ బ్లాక్‌బస్టర్ తర్వాత యూనివర్శిల్ పాపులారిటీ దక్కడంతో చరణ్ నెక్ట్స్ మూవీస్‌పై బజ్ ఉంది. ప్రస్తుతం తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్‌లో నటిస్తున్నారు చెర్రీ. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. అంజలి, సునీల్ , ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, జయరామ్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, నాజర్ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. దాదాపు రూ.200 నుంచి రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న గేమ్ ఛేంజర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు.
ఇదిలాఉండగా.. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)లో చరణ్ - ఉపాసన దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కు ఆర్ట్ అండ్ కల్చర్ అంబాసిడర్ పురస్కారాన్ని అందజేశారు. అలాగే ప్రఖ్యాత ఫెడ్ స్క్వేర్ వద్ద జరిగిన భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 2009లో ఆరెంజ్ మూవీ కోసం ఆస్ట్రేలియాకు వచ్చానని.. ఆ సమయంలో ఆస్ట్రేలియా ప్రజలు తనపై చూపించిన ఆదరణను మరిచిపోలేనని చరణ్ ఎమోషనల్ అయ్యారు.
కాగా.. నటన, క్రమశిక్షణపరంగా నాన్నగారి నుంచి తానెప్పుడూ స్పూర్తిని పొందుతానని మెగాపవర్ స్టార్ ఎన్నోసార్లు తెలిపారు. తాజాగా ప్రముఖ మూవీ వెబ్‌సైట్ ఐడల్ బ్రైన్ నిర్వహించిన ఓ ఈవెంట్‌లో చరణ్ పలు ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. అయితే నాన్నగారు ఎప్పుడూ నటన ఇలా చేయాలని, సినిమా అయిపోయిన తర్వాత హిట్ అయినా ఫ్లాప్ అయినా మా బుర్రలో దాని గురించి రుద్దడం చేసేవారు కాదన్నారు. ఎలా నటించాలో ఎవరికి వాళ్లే నేర్చుకోవాలని, ఎవరో ఒకరు చెప్పడం కరెక్ట్ కాదని చరణ్ తెలిపారు.
జీవితంలో షూటింగ్‌కు వెళ్లిన తొలిసారి ఆయన ఒక్కటే చెప్పారు.. మన స్టాఫ్, మన కోసం కష్టపడేవాళ్లని బాగా చూసుకోవాలని సూచించారని గుర్తుచేశారు. నాన్నగారు చెప్పిన మాట ప్రకారమే.. నా తొలి సినిమా నుంచి ఉన్న స్టాఫ్‌ని బాగా చూసుకుంటున్నానని రామ్ చరణ్ తెలిపారు. ఒక్కొక్కొరు 15 ఏళ్ల నుంచి నా దగ్గర పనిచేస్తున్న వారు 20 మంది వరకు ఉన్నారని .. వాళ్లందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పారు. ప్రస్తుతం రామ్ చరణ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











